Ukrain: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్‌ సైనికులు!

ఉక్రెయిన్‌ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్‌ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్‌ అధికారులు తెలిపారు.

New Update
russia

Fighter Jets

 

ఉక్రెయిన్‌ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్‌ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్‌ అధికారులు తెలిపారు. గత మూడు వారాలుగా మాతో యుద్దంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు.

Also Read: America: వీసా గడువు ముగిసినా అమెరికాలో.. మరింత కఠినంగా నిబంధనలు, భారతీయులపై తీవ్ర ప్రభావం!

మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడడంతో వారు వెనక్కి వెళ్తున్నట్లు అనుకుంటున్నాం అని స్పెషల్‌ ఆపరేషన్‌ ఫోర్సెస్‌ ప్రతినిధి ఒలెక్సాండర్‌ కిండ్రాటెంకో తెలిపారు.ఇక కీవ్‌ అధికారులు పేర్కొన్న విషయం పై స్పందించేందుకు క్రెమ్లిన్‌ నిరాకరించింది. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. 

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

దాదాపు మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ఉక్రెయిన్‌ చొరబాటును అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతమైన కుర్క్స్‌ లో రష్యా తన సైన్యాన్ని మోహరించింది. ఇందుకు గాను దాదాపు 10 వేల మంది కిమ్‌ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ..మాస్కో, కొరియన్‌ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది.

ఈ క్రమంలోనే కిమ్‌ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్‌ ప్రకటించింది. చనిపోయిన సైనికుల ముఖాలను గుర్తు పట్టకుండా మాస్కో సేనలు కాల్చేస్తున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. మరో వైపు..ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఇరు దేశాధ్క్ష్మీక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారి పై ఆంక్షలు విధిస్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. 

Also Read:  Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Also Read: Horoscope Today: ఈ రాశివారు ఈరోజు ఉల్లాసంగా..ఉత్సాహంగా గడుపుతారు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు