ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్‌లే లక్ష్యంగా దాడులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు. By B Aravind 17 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై భారీగా దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించింది. ఆగస్టు నుంచి ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి ఇదే. తాజా దాడులతో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు. Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి? తాజాగా రష్యా చేసిన ఈ దాడితో కీవ్ సహా పలు జిల్లాలు, నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాజధాని కీవ్‌లో కూడా భారీగా పేలుళ్లు సంభవించాయి. ముఖ్యంగా ఇక్కడి సిటీ సెంటర్‌ను రష్యా లక్ష్యం చేసుకుంది. అయితే అక్కడ జరిగిన ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియలేదు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ అధికారులు సైతం విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన అంశాలు కూడా వెల్లడించలేదు. కానీ రష్యా డ్రోన్లు, క్షిపణులో పెద్ద దాడి చేసిందని చెప్పారు. నిద్రిస్తున్న ప్రజలు, కీలక వసతులను దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు! అయితే ఉక్రెయిన్‌పై రష్యా చేసిన తాజా దాడితో సరిహద్దుల్లో పోలాండ్ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ఎయిర్‌ఫోర్స్‌ను సిద్ధం చేసింది. రష్యా, ఉక్రెయిన్‌లో శీతాకాలం చాలా కఠినంగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇళ్లల్లో వేడి కోసం ప్రజలు విద్యుత్, గ్యాస్ వంటివి వాడుతుంటారు. ప్రస్తుతం అక్కడ శీతాకాలం రావడంతో ఉక్రెయిన్‌లో పవర్ గ్రిడ్‌లపై రష్యా దాడులు పాల్పడుతోంది. విద్యుత్ సరఫరా వల్ల అంతరాయాలు ఏర్పడి అక్కడ వేలాది మంది ప్రాణాలు తీయగలవు. Also Read: పిచ్చెక్కిస్తున్న పిల్లి సంపాదన.. రూ.800 కోట్లకు పైగా.. ఎలాగంటే? Also Read: ప్రధాని మోదీకి మరో అత్యున్నత పురస్కారం.. ఈసారి ఎక్కడంటే ? #telugu-news #telugu #ukraine #russia-ukraine #Airline Service Stop To Russia-Ukraine War Issue మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి