Cat: పిచ్చెక్కిస్తున్న పిల్లి సంపాదన.. రూ.800 కోట్లకు పైగా.. ఎలాగంటే?

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన వరిసిరి అనే మహిళ 5నెలల పిల్లిని దత్తత తీసుకుంది. దానికి నాలా అని పేరు పెట్టింది. ఆ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేయగా 4.5మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. దీంతో గిన్నీస్ రికార్డుకెక్కింది. అలాగే నాలా నికర సంపద రూ.840 కోట్లు.

New Update
nala cat

అది ఒక సంపన్న పిల్లి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదిస్తుంది. దాని మొత్తం సంపాదన రూ.840 కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఆ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. దీని బట్టి చూస్తే ఆ పిల్లి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్ ఇన్‌స్టాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న పిల్లిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సైతం ఆ పిల్లి సొంతం చేసుకుంది. 

ఇది కూడా చూడండి:  ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ!

నాలా పేరుతో ఇన్‌స్టా అకౌంట్

అమెరికాలోని కాలిఫోర్నియాలో 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ పిల్లిని దత్తత తీసుకుంది. అప్పటికి ఆ పిల్లి వయసు 5నెలలు. దానికి నాలా అనే పేరు పెట్టింది. అనంతరం ఆ మహిళ 2012లో పిల్లి పేరుతో ఓ ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసింది. అక్కడ నుంచి నాలా ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది. అలా అమాంతంగా ఆ పిల్లి అకౌంట్‌కు ఫాలోవర్స్ పెరిగిపోయారు. 

ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా!

4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు

దాదాపు నాలా పిల్లికి 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు వచ్చారు. దీంతో అత్యంత ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన పిల్లిగా నాలా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. భారీ ఫాలోవర్స్ కారణంగానే నాలా పిల్లి ఫోర్బ్స్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలో పేరు లిఖించుకుంది. అంతేకాదండోయ్ ఈ పిల్లి పేరుమీద ఒక బుక్ కూడా ఉంది. ‘లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్’ అనే పేరుతో ఈ-బుక్ ఉంది. 

ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా

నికర సంపద 100 బిలియన్‌ డాలర్లు

ఒకవైపు నాలా ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌తో డబ్బులు బాగా సంపాదిస్తోంది. ఇంకోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్ సహా రకరకాల ప్రొడెక్టులకు యాడ్స్ చేయడం ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదిస్తోంది. ఇలా మొత్తంగా నాలా నికర సంపద దాదాపు 100 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.840 కోట్లు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఒక పిల్లి ఇన్ని కోట్లు సంపాదింస్తుందా? అంటూ నోరెళ్లబెడుతున్నారు. 

ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు

Advertisment
Advertisment
తాజా కథనాలు