Ukraine: థర్డ్ వరల్డ్‌ వార్ మొదలైంది‌‌‌‌–ఉక్రెయిన్ మాజీ జనరల్

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే అనిపిస్తోంది అంటున్నారు ఉక్రెయిన్ మాజీ జనరల్.  ఉక్రెయిన్‌కు మద్దతిస్తోన్న అమెరికా, ఇటు రష్యా దూకుడు చర్యలతో సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోందని అన్నారు. 

New Update
ukraine

Ukrainian Commander-in-Chief Valery Zaluzhny:

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తాజాగా కొత్త మలుపులు తీసుకుంటోంది. ఒకరి మీద ఒకరు దీర్ఘశ్రేణి ఆయుధాలను వేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌ తమ ఆయుధాలు వాడుకోవచ్చని అమెరికా అనుమతినిచ్చింది. దాంతో రష్యా అణ్వాయుధాల ప్రయోగం అనుమతిపై సంతకం చేసింది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాలు మద్దతునిస్తుంటే...రష్యా సైన్యంలోకి ఉత్తర కొరియా సైన్యం వచ్చి చేరింది. దాంతో పాటూ ఓర్షెనిక్ లాంటి ఆయుధాలను బయటకు తీస్తోంది రష్యా. ఇదంతా చూస్తుంటే థర్డ్ వరల్డ్‌ వార్ మొదలైనట్టే అనిపిస్తోంది అంటున్నారు ఉక్రెయిన్ మాజీ కమాండర్ ఇన్ ఛీఫ్ వాలరీ. 

అమెరికా మద్దతు...రష్యాను కవ్విస్తోందని..దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఉక్రెయిన్ మాజీ జనరల్. ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడుతున్నారు. ఇరాన్‌ రూపొందించిన డ్రోన్ ఆయుధాలతో ఉక్రెయిన్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి  అని చెప్పారు.  ఇదంతా మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తోంది ఆయన వ్యాఖ్యలు చేశారు. తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్‌ మిత్రదేశాలకు జనరల్.. విజ్ఞప్తి చేశారు. ఈ యుద్ధాన్ని ఈ పరిస్థితుల్లో కూడా ఆపడం సాధ్యమేనని, కానీ..కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్యపక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక మంది శత్రువులు ఉన్నారన్న మాట వాస్తవమని చెప్పారు. 

Also Read: TS: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి

Advertisment
Advertisment
తాజా కథనాలు