కొత్త వాహనాలు కొనాలనుకునేవారికి రేవంత్ సర్కార్ బిగ్ షాక్! కొత్త వాహనాలు కొనాలనుకునేవారికి షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై జీవో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 25 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Raod Tax: వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కొద్దివారాల క్రితం అధ్యయనం చేశారు. త్వరలో దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవేళ రాడ్ టాక్స్ పెంచితే రూ.1పైనా ఉన్న టూ వీలర్ వాహనాలు, రూ.10లక్షల పైనా ఉన్న ఫోర్ వీలర్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై భారం పడనుంది. కాగా దీనిపై త్వరలోనే జీవో విడుదల కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ఆదాయంలో కీలకం...! దేశంలోని కొన్ని రాష్ట్రాలకు రోడ్డు టాక్స్ కారణంగానే ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఆయా రాష్ట్రాల్లో రోడ్డు పన్ను ఎక్కువగా ఉండడమే. అయితే.. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ రోడ్డు టాక్స్ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు రాష్టాల్లో.. కేరళలో గరిష్టంగా 21 శాతం, తమిళనాడులో 20 శాతంగా ఉంది. వాహనం మోడల్, ధరను బట్టి రాష్ట్రంలో గతంలో 12-14-18 శాతాలతో 3 రకాల రోడ్ ట్యాక్స్ శ్లాబులు ఉండేవి.. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022లో రోడ్ ట్యాక్స్‌ను పెంచుతూ శ్లాబుల్లో మార్పులు చేశారు. అయితే.. రాష్ట్ర రవాణాశాఖ ఆదాయంలో 65-70 శాతం వరకు రోడ్డు టాక్స్ పై ఉంటుంది. ఈ మేరకు 2021-22లో రూ.3,971.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2022లో రోడ్డు ట్యాక్స్ ను పెంచడంతో 2022-23లో ఏకంగా రూ.6,390.80 కోట్ల ప్రభుత్వ ఖజానాలో జమ అయింది. 2023-24లో రూ.6,990.29 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం రోడ్డు టాక్స్ ను పెంచితే సుమారు రూ.2వేల కోట్లకు పైగా ఆదాయం రవాణాశాఖకు వస్తుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. #telangana #cm-revanth-reddy #Road Tax మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి