OU: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన వీసీ

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ ​రోడ్ ​గేట్లను ఇక నుంచి ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకు ముందు వరకు ఈ గేట్లను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసి ఉంచేవారు.

New Update
ou

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ  మెయిన్ ​రోడ్ ​గేట్లను ఇక నుంచి  ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతకు ముందు వరకు ఈ గేట్లను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మూసి ఉంచేవారు. దీంతో బయటకు వెళ్లినప్పుడు తిరిగి వచ్చే సమయానికి గేట్లు మూసి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చాలా మంది విద్యార్థులు తెలిపారు.

Also Read: Parliament Sessions: ప్రారంభమైన శీతాకాలం సమావేశాలు..చర్చకు 17 బిల్లులు

దీంతో ఈ విషయం గురించి వీసీ ప్రొఫెసర్‌ కుమార్‌ కు వినతలు సమర్పించారు. దీంతో ఆయన విషయం గురించి స్పందించారు. బయటివ్యక్తులు, బయటి వాహనాల రాకపోకలు పెరిగి క్యాంపస్​ వాతావరణానికి విఘాతం కలుగుతోందని, విద్యార్థులు, ఉద్యోగులకు   బయట నుంచి వచ్చేవాహనాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మూడేండ్ల కింద వీసీగా ఉన్నప్పుడు ప్రొఫెసర్​ రవీందర్​ యాదవ్​  ఎన్​సీసీ గేటుతో పాటు ఓయూ పీఎస్ ​వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. 

Also Read: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే..వానలు

ఎన్​సీసీ గేటును రోజూ రాత్రి 8గంటలకు మూసి ఉదయం 8 గంటలకు తెరిచేవారు. అప్పట్లో విద్యార్థులు ఆందోళన చేసినప్పటికీ ఎవరూ  స్పందించలేదు. గేట్లు మూసివేసే సమయాన్ని గంటపాటు పొడిగించాలని కోరినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.

Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

తాజాగా వీసీగా ప్రొఫెసర్ ​కుమార్​ బాధ్యతలు చేపట్టాక విద్యార్థుల కోరిక మేరకు రెండు వైపులా గేట్లను  రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచేందుకు అధికారులు అంగీకరించారు. 

Also Read: ఝార్ఖండ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరెన్.. ఎప్పుడంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు