Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి సిద్ధం !

రష్యా.. ఉక్రెయిన్‌ పైకి అణు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 1200 అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు బాంబులను తరలిస్తున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Russia Likely to Nuclear Attack on Ukraine, Know Details

Russia Likely to Nuclear Attack on Ukraine

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఉక్రెయిన్‌.. రష్యాపై 117 డ్రోన్లతో విరుచుకుపడి 41 యుద్ధ విమానాలు ధ్వంసం చేసింది. ఆ తర్వాత రష్యా.. ఉక్రెయిన్‌పైకి 472 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ దాడుల్లో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. 

Also Read: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరదలు.. 34 మంది మృతి

రష్యా.. ఉక్రెయిన్‌ పైకి అణు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రష్యా అణు పరీక్షలు కూడా నిర్వహిస్తోందని వార్తలు వస్తున్నాయి. రష్యాలో అణు యుద్ధ వాహనాల కదలికలు కనపించినట్లు సమాచారం. ఇప్పటికే ఉక్రెయిన్.. రష్యాలో అణు సామర్థ్యం కలిగిన 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌పై ప్రతీకారంతో రష్యా అణు, హైడ్రోజన్ బాంబు దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఉక్రెయిన్‌ నాశనమైపోయే ఛాన్స్ ఉంటుంది. 

ప్రపంచంలోనే అత్యధిక అణు ఆయుధాలు ఉన్న దేశంగా రష్యా మొదటి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో దాదాపు 5600 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం అణు ఆయుధాల నిల్వలో 47 శాతం అని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) డేటా చెబుతోంది. అయితే ఉక్రెయిన్‌పై ఏకంగా 1200 అణుబాంబులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు బాంబులను తరలిస్తున్నట్లు సమాచారం. 

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

ఒక్క అణు బాంబు ప్రయోగిస్తేనే ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోతుందని నిపుణులు అంటున్నారు. ఇక అణుబాంబును మించి హైడ్రోజన్‌ బాంబు ఉంటుంది. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క హైడ్రోజన్‌ బాంబు ఏకంగా 3300 అణు బాంబులకు సమానం. రష్యా వద్ద 50,100 మెగావాట్ల శక్తిని విడుదల చేయగల సామర్థ్యం ఉంది. రష్యా చర్యలతో ప్రపంచ దేశాలు కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఉక్రెయిన్‌పై అణుబాంబులు ప్రయోగిస్తే ప్రపంచంపై భారీగా రేడియేషన్ ప్రభావం ఉండనుంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. చివరికి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయవచ్చు.  

 rtv-news | russia-ukraine-war 

Advertisment
Advertisment
తాజా కథనాలు