/rtv/media/media_files/2026/01/07/russia-2026-01-07-13-40-16.jpg)
Russia Deploys Submarine To Guard 'Sanctioned' Oil Tanker Targeted By US Near Venezuela
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న అనంతరం పరిస్థితులు మారిపోయాయి. వెనెజువెలాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రష్యా రంగంలోకి దిగింది. వెనెజువెలా తీరం వెంబడి చమరు నిక్షేపాలకు రక్షణగా సబ్‌మెరైన్‌ను, ఇతర నావికా దళాలను పంపించింది. పాత ఆయిర్ ట్యాంకర్‌కు రక్షణగా రష్యా వీటిని పంపించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
Also Read: కాంగ్రెస్తో బీజేపీ పొత్తు.. మహారాష్ట్ర పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్.. అసలేమైందంటే?
అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ట్యాంకర్ అనేది అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. గత రెండు వారాల నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో యూఎస్ కోస్ట్‌గార్డ్ రష్యా ఓడను ట్రాక్ చేస్తోంది. దీంతో తుప్పు పట్టిన ఖాళీ ఆయిల్ ట్యాంకర్‌కు రక్షణ కోసమే రష్యా సబ్‌మెరైన్, ఇతర నావాకా దళాలను పంపించినట్లు అమెరికాకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ మన ప్రధాని మోదీని కిడ్నాప్ చేస్తే.. కాంగ్రెస్ లీడర్ షాకింగ్ కామెంట్స్
గతేడాది డిసెంబర్‌లో యూఎస్ కోస్ట్ గార్డు ఓడను స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. కానీ సిబ్బంది మాత్రం దాన్ని అడ్డుకున్నారు. రష్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఓడకు రిజిస్ట్రేషన్ మంజూరు చేసిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ట్యాంకర్‌ను వెంబడించడాన్ని అమెరికా మానుకోవాలని రష్యా డిమాండ్ చేసింది. అలాగే ప్రస్తుతం ట్యాంకర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ ప్రాంతంలో రవాణా చేసే నిషేధిత నౌకలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించింది.
Follow Us