/rtv/media/media_files/2026/01/06/congress-leader-prithviraj-chavan-2026-01-06-18-50-25.jpg)
వెనిజులాలో ట్రంప్ ఆక్రమణ ఎగ్జామ్‌పుల్‌గా చూపిస్తూ కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పృథ్వీరాజ్ చవాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ బందీ చేసిన విషయాన్ని చెబుతూ "ట్రంప్ మన ప్రధానిని కూడా కిడ్నాప్ చేస్తారా?" అని పృథ్వీరాజ్ చవాన్ ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
Congress wants Bharat’s Prime Minister to be kidnapped!
— Ashok Singhal (@TheAshokSinghal) January 6, 2026
Frustrated with Rahul Gandhi’s “leadership” and desperate for power, Congress is now hoping that US will kidnap PM Modi Ji.
What was that line about “Desh ke Gaddaron ko…”? pic.twitter.com/zRzPJw54kY
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ఇటీవల తీసుకున్న కఠిన చర్యలు, ఆ దేశ అంతర్గత రాజకీయాల్లో ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా తన ప్రయోజనాల కోసం ఏ దేశాధినేతనైనా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని, అది మన దేశ సార్వభౌమత్వానికి ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పనామా లేదా వెనిజులా వంటి దేశాల్లో అమెరికా జోక్యాన్ని పృథ్వీ రాజ్ గుర్తు చేశారు.
ఈ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా స్పందించింది. ఇవి కేవలం ప్రధాని మోదీని కించపరచడమే కాకుండా, భారత ప్రజాస్వామ్యాన్ని, అంతర్జాతీయంగా దేశానికి ఉన్న ప్రతిష్టను అవమానించడమేనని మండిపడింది. భారత్ ఓ అగ్రరాజ్యమని, వెనిజులా వంటి చిన్న దేశాలతో పోల్చడం అవివేకమని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే, ఆ పృథ్వీరాజ్ కేవలం అమెరికా దూకుడు ధోరణిని హెచ్చరించడానికి మాత్రమే ఆ పదాన్ని వాడారని, ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సర్దిచెప్పే ప్రయత్నం చేశాయి.
ట్రంప్, ప్రధాని మోదీ మధ్య వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి 'షాకింగ్' కామెంట్స్ చేయడం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని రాజకీయ విమర్శగా కొట్టిపారేస్తుండగా, మరికొందరు మాత్రం విదేశీ విధానాలపై చర్చించేటప్పుడు హుందాతనం పాటించాలని సూచిస్తున్నారు. పృథ్వీరాజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదా పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Follow Us