/rtv/media/media_files/2026/01/07/bjp-2026-01-07-12-00-11.jpg)
A BJP-Congress alliance? Yes, the unthinkable has actually happened
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడి అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో పునర్వ్యవస్థీకరణ గందరగోళానికి దారితీసింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను పక్కన పెట్టి అధికారం కోసం బీజేపీ కాంగ్రెస్‌తో జతకట్టింది. కాంగ్రెస్‌ను బీజేపీ జాతీయ స్థాయిలో వ్యతిరేకిస్తూనే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి బిజెపికి చెందిన తేజశ్రీ కరంజులే మేయర్ పదవిని గెలుచుకోవడానికి సాయపడింది. ఈ కూటమికి మొత్తం 32 మంది కౌన్సిలర్ల మద్దతు లభించింది. బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి 12 మంది, అలాగే NCP (అజిత్ పవార్ వర్గం) నుండి నలుగురు - పౌర సంస్థలో స్పష్టమైన మెజారిటీని సాధించారు. ఈ పరిణామంపై శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
షిండే వర్గాని చెందిన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ ఈ బంధాన్ని "అపవిత్ర కూటమి"గా అభివర్ణించారు. బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ రహిత భారతదేశం గురించి మాట్లాడిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పాలన చేస్తోందని విమర్శించారు. ఇది శివసేన వెన్నుపోటు పొడవడమేనని మండిపడ్డారు. కానీ బీజేపీ మాత్రం ఈ విమర్శలను తోసిపుచ్చింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గులబ్‌రావ్ కరంజులే పాటిల్ శివసేనతో పొత్తు పెట్టుకోవడం సరైంది కాదన్నారు.
గత 25 సంవత్సరాలుగా షిండే నేతృత్వంలోని పార్టీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అంబర్‌నాథ్‌లో శివసేనతో విస్తృత పొత్తు కోసం బీజేపీ అనేక ప్రయత్నాలు చేసిందని, కానీ దాని నాయకత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని స్పష్టం చేశారు. అయితే అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ- కాంగ్రెస్ పొత్తు విజయం సాధించినప్పటికీ.. కూటమిలో విభేదాలను రేకెత్తించింది.
Follow Us