/rtv/media/media_files/2025/04/28/Q4Goryr8OPqAjpVqZ9Cv.jpg)
tamil proposed to girl friend on movie pre release stage
Viral Video ఓ తమిళ డైరెక్టర్ మూవీ ప్రీ రిలీజ్ వేదికపై.. ప్రియురాలికి ప్రపోజ్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, లైఫ్ లో సెటిల్ అవ్వలేదని సంవత్సరాలు తరబడి ప్రేమించుకొని. చివరికి బ్రేకప్ చెప్పుకుంటున్న ఈ రోజుల్లో.. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వెయిట్ చేసి.. అప్పుడు తన ప్రేమను పొందాడు ఈ యంగ్ డైరెక్టర్
స్టేజ్ పై ప్రపోజల్
డైరెక్టర్ అభిషన్ జీవంత్ తెరకెక్కించిన తొలి సినిమా 'టూరిస్ట్ ఫామిలీ' మే 1 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా .. డైరెక్టర్ అభిషన్ స్టేజ్ పై తన ప్రేమ గురించి చెప్పారు. తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు ప్రపోజ్ చేశాడు. తనకు అఖిలతో 6వ తరగతి నుంచి పరిచయం ఉందని.. ఆమెను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాని తెలిపారు.
స్టేజి పైనే ప్రియురాలికి ప్రపోజ్ చేసిన తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2025
తాను డైరెక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండ్ అఖిలను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసిన తమిళ డైరెక్టర్ అభిషన్ జీవంత్
అభిషన్ జీవంత్ ప్రపోజ్ చూసి… pic.twitter.com/4c6nqqzQPT
అభిషన్ ప్రపోజల్ విని అఖిల ఆనందబాష్పలతో కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'వావ్ సూపర్ లవ్'.. లైఫ్ ఒక లక్ష్యం పెట్టుకొని.. అది రీచ్ అయిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం చాలా గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అఖిల, అభిషన్ ప్రేమకు తమ బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.
telugu-news | cinema-news | latest-news
Also Read: HBD Samantha బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సామ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!