Colonel Sofiya Qureshi : కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి..ఫేక్ ఫోస్ట్ పై పోలీసులు ఏమన్నారంటే...

భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌ తన కుట్రలు మాత్రం ఆపడం లేదు. దేశంలో మత పరమైన సమస్యలు సృష్టించేందుకు ఫేక్‌ ఫోస్టులు పెడుతూ శునకానందం పొందుతోంది. సైన్యంలో కీలకంగా ఉన్నసోపియా ఖురేషి ఇంటిని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారని పోస్ట్‌ పెట్టారు.

 Colonel Sofiya Qureshi

Colonel Sofiya Qureshi

New Update

భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌ తన కుట్రలు మాత్రం ఆపడం లేదు. దేశంలో మత పరమైన సమస్యలు సృష్టించేందుకు ఫేక్‌ ఫోస్టులు పెడుతూ శునకానందం పొందుతోంది. మరోవైపు పేక్‌న్యూస్‌ ప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోతుంది. తాజాగా మనదేశంలో అస్తిరతను రేపాలనే లక్ష్యంతో సైబర్‌ దాడులకు తెరలేపింది. ఈ క్రమంలో ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఆ పోస్ట్‌ తీవ్ర కలకలానికి దారితీసింది. సైన్యంలో కీలకంగా ఉన్నసోపియా ఖురేషిది కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి ప్రాంతం. అయితే ఆమె ఇంటిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు ముట్టడించి ధ్వంసం చేశారని పోస్ట్‌ పెట్టారు.

Also Read :  పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

RSS Attack On Colonel Sofiya Qureshi's House

ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంపై అప్రమత్తమైన కర్ణాటక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ పోస్ట్ చేసిన ఎక్స్ ప్రొఫైల్ పేరు “అనిస్ ఉద్దీన్” గా తేల్చారు. ఆ లొకేషన్‌ బ్రిటిష్‌ కొలంబియా, కెనడాగా నిర్ధారించారు.ఈ ప్రొఫైల్ 405 హ్యాండిల్స్, 31 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ ఎక్స్‌ ప్రొఫైల్‌ చేసిన పోస్టులన్నీ కూడా పాకిస్థాన్‌ కు మద్ధతుగా ఉన్నాయని తేల్చారు. అంతేకాక  కవర్ ఇమేజ్‌లో పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నా, ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇతర పాకిస్తాన్ ఉన్నత  రక్షణ అధికారుల ఫోటోలు కనిపించడంతో ఇది పాక్‌ కుట్రగానే పోలీసులు భావిస్తున్నారు.

Also Read :  సంచలన తీర్పు.. లైంగిక వేధింపుల కేసులో 8మందికి జీవిత ఖైదు

ఈ పోస్టు చూసిన చాలామంది నెటిజన్లు దాడి జరిగిందా అనే అంశంలో ఆన్‌లైన్‌ లో వెతకడం కలకలం రేపింది. అయితే భారత సైన్యంలో కీలక విధులు నిర్వహిస్తున్న కల్నల్‌ సోఫియా ఖురేషి ఇంటిపై దాడి జరిందన్న వార్తలను కర్ణాటక పోలీసులు ఖండించారు. అవన్నీ ఫేక్‌ పోస్టులని తేల్చి చెప్పారు. ఈ పోస్టు చేసిన వారికోసం గాలిస్తున్నామని, దాన్ని వెంటనే తొలగించాలని వార్నింగ్‌ ఇచ్చినట్లు 
బెళగావి ఎస్పీ తెలిపారు. నిజానికి  కల్నల్ ఖురేషి గుజరాత్‌లోని వడోదరలో జన్మించారు. ఆమె బెళగావికి చెందిన కల్నల్ తాజుద్దీన్‌ బాగేవాడిని పెండ్లాడారు. దీంతో కల్నల్ ఖురేషి అత్తమామలు బెళగావిలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వారి ఇంటిమీదే దాడి జరిగిందన్న పేక్‌ పోస్టులు పెడుతూ మతపరమైన సమస్యలు సృష్టించేలా పాకిస్థాన్‌ ప్రయత్నిస్తోంది.

Also Read :  పాక్ ఎయిర్ బేస్‌‌లను నాశనం చేసిన ఇండియా.. ఫొటోలు వచ్చాయ్ చూడండి

Also Read :  కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!

 

gujarath | karnataka | post | fake | colonel sofia qureshi

#pakistan #karnataka #gujarath #fake #post #colonel sofia qureshi
Advertisment