/rtv/media/media_files/2025/07/24/h1b-2025-07-24-10-36-56.jpg)
USA H1 B Visa
అమెరికాలో పనిచేస్తున్న H-1B వీసాదారులకు ఈ సమయం చాలా సవాలుగా మారుతోంది. ఎవరైనా హెచ్ 1 బీ వీసా ఉన్నవాళ్లు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండడం లేదా వేరే జాబ్ మారడం లాంటివి జరిగినప్పుడు వాళ్ళ వీసా గ్రేస్ పిరియడ్ లో ఉంటుంది. ఇది 60 రోజులు ఉంటుంది. ఈ గ్రేస్ పిరియడ్ లో అమెరికాలో వారు ఏ పని చేయకపోయినా ఉండవచ్చును ఇప్పటి వరకు ఉన్న రూల్స్ ప్రకారం. అయితే ఇప్పుడు వారిపై కూడా చర్యలు మొదలుపెట్టింది అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ.
గ్రేస్ పిరియడ్ లో ఉంటే ఇంటికే..
గ్రేస్ పిరియడ్ లో ఉన్న హెచ్ 1 బీ వీసాదారులకు నోటీస్ టు అప్పియర్ ను పంపిస్తోంది US పౌరసత్వం అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్. దీనినే NTA అంటారు. ఇది దేశ బహిష్కరణలో మొదటి చర్య. మామూలుగా అయితే దీనిని యూఎస్ లో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారికి పంపిస్తారు. ఇప్పుడు ఇది వీసా స్థితి మార్పు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న వారికి కూడా అందుతోంది. ఒకసారి NTA అందితే హెచ్ 1 బీ వీసాదారుల వీసా సమయ పరిమితి మరింత పెరుగుతుంది. అదే కాక గ్రీన్ కార్డ్ రావడం కూడా కష్టమౌతుంది. భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశించకుండా 3 నుంచి 10 ఏళ్ళ నిషేధం కూడా విధించే అవకాశాలు ఉంటాయి.
మామూలుగా అయితే స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును 60 రోజుల గ్రేస్ పీరియడ్‌లోపు చేయవచ్చు. ఈ లోపు NTA పంపకూడదు. దరఖాస్తుపై నిర్ణయం వచ్చేవరకు వెయిట్ చేయాలి. కానీ ఇప్పుడు USCIS ఈ రూల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసింది. గ్రేస్ పిరియడ్ లో ఉంటే చాలు నోటీస్ టు అప్పియర్ ను పంపించేస్తోంది. దీంతో H-1B వీసా హోల్డర్లు వారి I-539 (స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు) పెండింగ్‌లో ఉన్న సమయంలో NTA పొందుతున్నారు. ఇది చాలా అన్యాయం అని అక్కడి భారత ఇమ్మిగ్రేషన్ న్యాయవాది రాజీవ్ ఎస్.ఖన్నా అంటున్నారు.
Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం