/rtv/media/media_files/2025/11/02/rob-jetten-set-to-become-youngest-dutch-pm-as-centrist-d66-wins-netherlands-elections-2025-11-02-18-37-06.jpg)
Rob Jetten Set To Become Youngest Dutch PM As Centrist D66 Wins Netherlands Elections
నెదర్లాండ్(netherlands)లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల D66 సెంట్రీస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ చీఫ్ రాబ్ జెట్టెన్(Rob Jetten) (38) ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. చిన్న వయస్సులోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్న ఆయన 'గే' కూడా. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా చెప్పుకున్నారు. ఎన్నికల ఫలితాలు చారిత్రాత్మకమని.. దేశ ప్రజలు తమకు గొప్ప బాధ్యత అప్పగించారని పేర్కొన్నారు. ఇదిలాఉండగా రాబ్ జెట్టెన్‌కు అర్జెంటీనాకు చెందిన హాకీ ఆటగాడు నీకోలస్ కీనన్‌తో మూడేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్ జరిగింది.
Also read: చెరువులోకి దూకి చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్
ఇటీవల నెదర్లాండ్‌లో ఎన్నికలు జరగగా.. రాబ్ జెట్టెన్ నేతృత్వంలోని D66 సెంట్రీస్ పార్టీ.. 'పార్టీ ఫర్ ఫ్రీడమ్' పార్టీని ఓడించింది. పార్టీ ఫర్ ఫ్రీడమ్ చీఫ్ గీర్ట్ వైల్డర్స్ ఇస్లాం వ్యతిరేక నాయకుడు. ఈయన ఎన్నికల ప్రచారంలో వలస వ్యతిరేకత, ఖురాన్‌పై నిషేధం లాంటి అంశాలను ప్రచారం చేశారు. అయినప్పటికీ నెదర్లాండ్ ప్రజలు D66 పార్టీకే అధికారం అప్పగించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గీర్ట్ వైల్డర్స్‌కు ప్రజాదరణ చాలావరకు తగ్గిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: ట్రంప్ టారిఫ్‌లపై.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
రాబ్ జెట్టెన్ ఎవరు ?
రాబ్ జెట్టెన్ నెదర్లాండ్స్‌లోని ఉడెన్ నగరంలో జన్మించాడు. నీమెయర్‌లోని రాడ్‌బౌడ్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలనను అభ్యసించాడు. ఆయన పేరెంట్స్ ఇద్దరూ కూడా పాఠశాల ఉపాధ్యాయులు. జెట్టెన్‌కు చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్, ఇతర క్రీడలు అంటే ఇష్టం ఉండేది. మొదట్లో ఆయన తన జీవితాన్ని క్రీడల్లో లేదా వ్యాపారంలో కొనసాగించాలనుకున్నాడు. కానీ జీవితం తనను వేరే మార్గంలోకి తీసుకెళ్లిందని.. నెదర్లాండ్‌లో తనకు ఇప్పుడు అందమైన ఉద్యోగం ఉందని చెప్పుకొచ్చాడు. అర్జెంటీనా ఆటగాడు నికోలస్ కీనన్‌తో ఆయనకు నిశ్చితార్థం కాగా.. వీళ్లు వచ్చే ఏడాది స్పెయిన్‌లో పెళ్లి చేసుకోనున్నారు.
Follow Us