Rahul Gandhi: చెరువులోకి దూకి చేపలు పట్టిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ర్యాలీలు, సభల్లో బిజీగా ఉన్న రాహుల్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఈ తీరిక సమయంలో పట్నాలోని ఒక చెరువుకు వెళ్లారు. అక్కడ వారు చేతితో చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలను కాంగ్రెస్‌ పార్టీ ‘X’లో పోస్ట్‌ చేసింది.

New Update
Rahul Gandhi

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Bihar election campaign)లో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బెగుసరాయ్‌ జిల్లాలో ఆయన మత్స్యకారులతో కలిసి చేపల వేట పట్టారు(Rahul Gandhi catch fish). బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ర్యాలీలు, సభల్లో బిజీగా ఉన్న రాహుల్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఈ తీరిక సమయంలో పట్నాలోని ఒక చెరువుకు వెళ్లారు. అక్కడ వారు చేతితో చేపలు పట్టే (ఫిషింగ్) ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్‌ చేసింది. మాజీ మంత్రి, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ వ్యవస్థాపకుడు, విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్‌ సాహ్నీతో కలిసి రాహుల్‌ గాంధీ బోటు సాయంతో ఓ చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలోనే చేపలు పట్టేందుకుగానూ ముకేశ్‌ సాహ్నీ నీళ్లలోకి దిగి వలవేశారు. కాసేపటికి రాహుల్‌ గాంధీ సైతం నీళ్లలో దూకారు. మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. ఈత కొట్టారు.

Also Read :  NHAI: నేషనల్ హైవేలపై యాక్సిడెంట్లు.. కేంద్రం కీలక నిర్ణయం

Rahul Gandhi Jumps Into Pond

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్ష 'మహాగఠ్‌బంధన్' నేత రాహుల్ గాంధీ, మిత్రపక్షం తేజస్వి యాదవ్ (ఆర్జేడీ) కలిసి సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బిజీ బిజీ ప్రచార పర్యటనల మధ్య, కూటమి నేతలు కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి ఉల్లాసంగా గడిపారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read :  ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం5

తేజస్వి యాదవ్ ఈ సరదా క్షణాలను పంచుకుంటూ, "జీవితం సముద్రం వంటిది, ఇక్కడ మీరు ఏ సవాలును చేపగానైనా పట్టుకోవచ్చు. జీవితం, రాజకీయాలు, సమాజం వివిధ అంశాలపై రాహుల్ జీతో అద్భుతమైన సంభాషణ జరిగింది" అని పేర్కొన్నారు. ప్రచార ఒత్తిడిని తగ్గించుకుంటూ, ఇద్దరు యువ నేతలు మధ్య బలమైన స్నేహ బంధాన్ని, దృఢమైన కూటమి బంధాన్ని చాటుకోవడమే ఈ అనధికారిక భేటీ లక్ష్యంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు