Syria:సిరియాలో పోలీసుల మృతితో ప్రభుత్వం రివేంజ్.. అసద్ గ్యాంగ్ లో 200 మంది మృతి!

సిరియా తీరప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు, ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు.

New Update
Syria Car accident

Syria Car accident Photograph: (Syria Car accident)

సిరియాలో ఇంకా ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. 14 సంవత్సరాల అంతర్యుద్ధం దేశాన్ని ఇంకా వెంటాడి వేధిస్తూనే ఉంది. తాజాగా సిరియా తీరప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించారు. ఇది అసద్ గ్రూపునకు, ప్రభుత్వ దళాలకు చెందిన హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలోని గ్యాంగ్ చేసిన ఘోరమైన దాడిగా పేర్కొంటున్నారు.

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఐదు రోజుల పాటూ..

డిసెంబర్ ప్రారంభంలో ఇస్లామిస్ట్ గ్రూపు హయత్ తహ్రీర్ అల్-షామ్ నేతృత్వంలో తిరుగుబాటు గ్రూపులు బషర్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, దేశంలో పలు ప్రాంతాలను వారి నియంత్రణలోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత, సిరియాలో ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల సిరియాలో కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సాయుధ దళాలపై అసద్ గ్రూప్ దాడులు చేసింది. 

Also Read: AP Tenth Exams: టెన్త్‌  విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం.. అయితే ..!

దీంతో ప్రభుత్వ భద్రతా దళాలకు చెందిన పలువురు పోలీసులు చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అసద్ గ్రూప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడులు జరిగాయి.ఈ దాడుల్లో 200 మందికి పైగా మరణించారు. ఈ మృతుల్లో 50 మంది సిరియా ప్రభుత్వ దళాల సభ్యులు ఉండగా, 45 మంది అసద్‌కు విధేయులైనవారు ఉన్నారు. వీరిలో 140 మంది సిరియాలోని ప్రజలే. బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన మేరకు, ఈ ఘర్షణలు జబ్లే సమీపంలో ప్రభుత్వ దళాలు ఒక వాంటెడ్ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మొదలయ్యాయని సమాచారం.

ఈ దాడులు తీర ప్రాంత గ్రామాలపై జరిగాయి. షియర్, ముఖ్తారియా, హఫా గ్రామాలపై జరిగిన దాడుల్లో 69 మంది  మరణించారు. వివరాల ప్రకారం 30 మందికి పైగా ముఖ్తారియా గ్రామంలోనే మరణించారు. ఆ తర్వాత సిరియా ప్రభుత్వ భద్రతా దళాలు ప్రతీకారం తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తీరప్రాంతం వైపు వెళ్ళారు. డమాస్కస్ కూడా తమ ఆత్మరక్షణ కోసం, తీరప్రాంత పట్టణాలు లటాకియా, టార్టస్, ఇతర సమీప గ్రామాలకు సైన్యాన్ని పంపింది. 

ఈ ప్రాంతాలు అసద్ మైనారిటీ అలవైట్ శాఖకు చెందినవి. అక్కడ ఎక్కువ సంఖ్యలో అలవైట్లు నివసిస్తుంటారు.సిరియా ప్రభుత్వం మృతుల సంఖ్యను అధికారికంగా ప్రస్తావించలేదు. కానీ జనం మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. సిరియా వార్తా సంస్థ SANA ప్రకారం పలు రకాల వ్యక్తిగత ఉల్లంఘనల కారణంగా చర్యలు తీసుకున్నామని, ఆ సమస్యను నివారించేందుకు కృషి చేస్తున్నామని ఓ భద్రతా అధికారి అన్నారు.

2011లో ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధం ఇప్పటికీ దేశంలో అత్యంత బలమైన హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. ఇప్పటివరకు లక్షల మంది మరణించారు, మరికొంత మంది నిరాశ్రయులయ్యారు. దీంతో సిరియా ప్రజాస్వామ్య చరిత్రలో ఇది సంక్షోభ ప్రభుత్వంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Summer:ఎండలు ముదురుతున్నాయి..జాగ్రత్త!

Also Read: Crime News: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. మరొకరి ప్రాణాలు కాపాడి.. తాను ప్రాణాలు విడిచిన డీఎస్పీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు