/rtv/media/media_files/2024/11/11/HazdpxB7PlMtoNs3a5Vi.jpg)
Vivek Ramaswami:
హిందూ మతం, ధర్మం చెడ్డది, అది ఒక దుష్టశక్తి అంటూ ఒక క్రిస్టియన్ మాట్లాడారు. విగ్రహారాధన చేసే మతం అంటూ కామెంట్స్ చేశారు. దీనిని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి ఖండించారు. ఎందుకు కేవలం ఒక్క మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారంటూ మాట్లాడారు. అమెరికా ఎన్నికల సమయంలో...వివేక రామస్వామికి, క్రిస్టియన్ వ్యక్తికి మధ్య జరిగిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చర్చలో వివేక్ చాలా ప్రశాంతంగా మాట్లాడారు. క్రిస్టియన్ వ్యక్తి ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా..కూల్‌గా సమాధానాలు ఇచ్చారు. హిందూ మతం ధర్మం గురించి వివరించారు. తమ మతాన్ని ఇన్నిమాటలంటున్నారు...అదే ఇతర మతాలను తామ అలా అంటే ఏమయ్యేదని వివేక్ రామస్వామి ప్రశ్నించారు. ఆయ ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వివేక్ రామస్వామి ప్రదర్శించిన ప్రశాంత వ్యక్తిత్వం, వ్యాఖ్యలు పరమత సహనానికి అద్దం పట్టాయని..సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి...
Some on the left reject Thomas Jefferson because he was a “slaveholder.” Some on the right reject him because he was a “deist” & “an enemy of Christianity.” Both are foolish. A fun teaching moment tonight. 🇺🇸 pic.twitter.com/kpuXMJhz95
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) October 16, 2024
Also Read: కేటీఆర్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం
అమెరికా లేదా ఇతర దేశాల్లో ఎప్పుడూ హిందూ మతాన్ని ఎక్కడో ఒక చోట కించపరుస్తూనే ఉంటారు. హిందూ ధర్మంపై, పూజా విధానంపై వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇతర మతాలపై అంటే క్రైస్తవ లేదా ఇస్లాం ధర్మాల గురించి ఇలా అంటే వచ్చే స్పందనలు హిందుయిజం పై దాడి జరిగినప్పుడు రావడం లేదు. హిందూ మతాన్ని ఎవరు ఏమన్నా గొడవు జరగవు. హిందువులు వినేసి ఊరుకుంటారు లేదా...సహనంగా సమాధానం చెప్తారు. ఇప్పుడు వివే రామస్వామి చేసింది కూడా అదే. అందుకే ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ డిస్కషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Jarkhand: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..
Also Read: సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? రేవంత్ : కేటీఆర్