Trump: ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్‌ ను మేం దెబ్బతీయడమా?

ఇజ్రాయెల్‌ తో కలిసి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పని చేస్తోందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ట్రంప్‌ స్పందించారు.ఇరాన్‌ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నానని, కానీ ఇలాంటి రూమర్స్‌ నిజం కాదని అన్నారు.

New Update
Donald Trump

Donald Trump

Trump: ఇజ్రాయెల్‌ తో కలిసి ఇరాన్‌ను దెబ్బతీసేందుకు అమెరికా పని చేస్తోందంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భేటీ జరిగిన తరువాత ఈ ఊహాగానాలు మొదలు అయ్యాయి. దీని పై తాజాగా ట్రంప్‌ స్పందించారు.

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

ఇవి కేవలం రుమార్స్‌ మాత్రమే అంటూ కొట్టి పారేశారు.''ఇరాన్‌ ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్‌ తో కలిసి అమెరికా పని చేస్తోందంటూ వచ్చిన కథనాలు అతిశయోక్తిగా ఉన్నాయి. ఇరాన్‌ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నా. 

Also Read:Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

ఎందుకంటే , ఇది శాంతియుతంగా ఆ దేశం అభివృద్దికి ఉపయోగపడుతుంది. ఇరాన్‌ గొప్ప దేశంగా ఉండాలని కోరుకుంటున్నాను. అణ్వాయుధాలు కలిగిన దేశంగా కాదు. ఇరాన్‌ వద్ద అవి ఉండకూడదు అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

ట్రంప్‌ తమ దేశానికి మిత్రుడని

కాగా ..ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లిన సందర్భంలో  ఆయన..ట్రంప్‌ తమ దేశానికి మిత్రుడని పేర్కొన్నారు. అంతే కాకుండా ,ఆయన ఆలోచన తీరు హమాస్‌ చర్యలను అడ్డుకోవడంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్‌ ఇరాన్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెహ్రీన్‌ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి..ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కఠిన నిబంధనలు పునరుద్ధరించారు.

అందుకు సంబంధించిన పత్రాలపై ఆయన సంతకం చేశారు.నెతన్యాహు పర్యటనతో ఇరాన్‌ కు వ్యతిరేకంగా ఇరుదేశాలు ప్రణాళిక రచిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. దీని పై తాజాగా స్పందించిన ట్రంప్‌..ఈ వ్యాఖ్యలు చేశారు.  

Also Read:Ind vs Eng: భారత్‌తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ!

Also Read: Illegal Indian Migrants: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్‌.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం

Advertisment
Advertisment
తాజా కథనాలు