Ind vs Eng: భారత్‌తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6నుంచి మొదలుకానుంది. దీంతో నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ఒకరోజు ముందుగానే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. 15 నెలల తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు.

New Update
ind vs eng

Ind vs Eng 1 ODI

Ind vs Eng: భారత్-ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ రేపటితో మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్ కోసం ఒకరోజు ముందుగానే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. 15 నెలల తర్వాత స్టార్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులోకి తిరిగొచ్చాడు. భారత్‌లోనే 2023 వన్డే ప్రపంచ కప్‌లో నవంబర్ 11న పాకిస్థాన్‌తో చివరి వన్డే మ్యాచ్ ఆడిన రూట్ ఇన్నాళ్లకు మళ్లీ భారత గడ్డపైనే బరిలోకి దిగనున్నాడు. ఇక 5 టీ20ల సిరీస్ లో ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో ఉంది. 

ఇంగ్లాండ్ తుది జట్టు:

జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్‌కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, , లియామ్ లివింగ్‌స్టన్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్స్‌, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, జోఫ్రా ఆర్చర్.

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన టీమ్ ఇండియా ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే అందరి చూపు ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓడిపోయిన రోహిత్ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగాన ఇంగ్లాండుతో జరిగే మూడు వన్డేల్లో రోహిత్, విరాట్ రాణించాలని చూస్తున్నారు. ఇక బుమ్రా ఆఖరి వన్డేలో ఆడతాడని చెప్పినా అదీ కష్టంగానే కనిపిస్తోంది. మహ్మద్‌ షమీ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. 10 ఓవర్లూ వేసేంత ఫిట్‌నెస్‌ ఉందా లేదా అనేది ఈ ఇంగ్లండ్‌ సిరీస్‌ తో బయటపడనుంది. వరుణ్‌ చక్రవర్తి ఆఖరి నిమిషంలో ఇంగ్లండ్‌తో వన్డేలకు ఎంపికయ్యాడు. 

ఇది కూడా చదవండి: PMGKAY: ట్యాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వ పథకాలు బంద్!

భారత్ జట్టు అంచనా:

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శుభ్ మాన్ గిల్, హార్ధిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌, ఆర్షదీప్ సింగ్. 

Advertisment
తాజా కథనాలు