/rtv/media/media_files/2026/01/17/afghanistan-pak-2026-01-17-11-36-39.jpg)
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దూరం పెరుగుతోంది. రీసెంట్ గా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘాన్...పాకిస్తాన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై నిషేధం విధించింది. దీని స్థానంలో భారతీయ మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది.
అత్యధిక ధరలే కారణం..
ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఓ చిన్న కొనుగోలు అక్కడ పెద్ద దుమారమే రేపింది. ఏకంగా ఒక దేశంతో వాణిజ్యాన్ని నిషేధించే వరకు చేరుకుంది. రీసెంట్ గా ఆఫ్ఘనిస్థాన్ ఓ ఓ వ్యక్తి పారాసిటమాల్ కు సంబంధించిన పరోల్ ను కొనుక్కున్నాడు. ఈ మందులను ఆఫ్ఘాన్ కు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి మందులు కొంటున్న ఫార్మాసిస్ట్ అతనికి భారత్ నుంచి వచ్చిన టాబ్లెట్ లను తీసుకోమని సూచించారు. పాక్ మందుల కంటే భారత్ టాబ్లెట్లు నాలుగు రెట్లు చౌకగా వస్తాయని చెప్పారు. నాణ్యత కూడా ఎక్కువని తెలిపారు. ఈ మొత్తం విషయాన్ని ఆ ఆఫ్ఘానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయింది. తాలిబాన్ ప్రభుత్వం వరకూ చేరింది.
కాబుల్ కు భారత్ సహాయం..
ఆఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆలోచనలో ఉంది. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఔఫధాల నాణ్యత తక్కువగా ఉందని..ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాన మంత్రి అబ్దుల్ ఘనీ బరదార్ చెబుతూనే ఉన్నారు. వాటికి ప్రత్యామ్నాయాలు వెతకాలని వ్యాపారులను కోరారు. ఈ క్రమంలో భారత్ నుంచి మందులు వారిని ఆకర్షించాయి. దీంతో పాకిస్తాన్ తో ఔషదాల వాణిజ్యాన్ని నిషేధించి..భారత్ కొనసాగించాలని ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయించింది. ఇప్పటికే న్యూఢిల్లీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాబూల్‌కు $108 మిలియన్ల విలువైన మందులను పంపిందని.. 2025 మిగిలిన కాలంలో $100 మిలియన్ల విలువైన ఎగుమతులు జరుగుతాయని నివేదికలు సూచిస్తున్నాయి.
దీనికి ముందు ఆఫ్ఘనిస్థాన్ ఆరోగ్యానికి సంబంధించి పాకిస్తాన్ పై ఆధారపడింది. భౌగోళికంగా ఆ దేశానికి దగ్గరగా ఉండడం, తక్కవు ఖర్చులతో మందులు, ఇతర పరికరాల సరఫరా జరగడం ఇందుకు కారణం. ఆఫ్ఘనిస్తాన్ దేశీయంగా ఔషధాల ఉత్పత్తి చాలా తక్కువ..దాని మందులలో 85–96% దిగుమతి అవుతున్నవే ఉంటాయి. ట్రేడింగ్ ఎకనామిక్స్ ద్వారా UN COMTRADE డేటా ప్రకారం.. పాకిస్తాన్ 2024ల ఆఫ్ఘనిస్తాన్‌కు $186.69 మిలియన్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉపయోగించే మందులలో 70% పైగా నవంబర్ 2025 కి ముందు పాకిస్తాన్ నుండి వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో పదేపదే సరిహద్దు ఘర్షణలు జరగాయి. దాని తరువాత టోర్ఖం, చమన్ సరిహద్దు క్రాసింగ్‌లను గత ఏడాది ఆఫ్ఘన్ వ్యాపారులకు పాక్ మూసివేసింది. దీంతో తాలిబన్ నాయకత్వం పాకిస్తానీ మాదకద్రవ్యాలపై పూర్తిగా నిషేధం విధించింది. దీని వలన ఆఫ్ఘాన్ లో తీవ్రంగా ఔషధాల కొరత ఏర్పడింది.
కీలక ఒప్పందం..
సరిగ్గా ఇదే సమయంలో ఆ దేశాన్ని భారత్ ఆదుకుంది. 73 టన్నుల ఆరోగ్య సామాగ్రిని కాబుల్ కు పంపింది. భారత్ ఇంతకు ముందు కూడా ఇలా మందులను , ఇతర సామాగ్రిని చాలా సార్లే పంపించింది. దీంతో ఇరు దేశాల మధ్యనా ఈ విషయంలో ఒప్పందం కుదిరింది. భారతీయ ఫార్మా మేజర్లు కాబూల్‌కు ఔషధాలను అమ్మడం మాత్రమే కాదు. నవంబర్ 2025లో దుబాయ్‌లో భారత ఫార్మా మేజర్ జైడస్ లైఫ్‌సైన్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రోఫీస్ ఇంటర్నేషనల్ గ్రూప్‌తో $100 మిలియన్ల అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేశాయి. దీంతో ఆఫ్ఘాన్ కు చవకగా ఔషధాలను భారత్ ఇవ్వగలుగుతోంది. ఈ కారణంతోనే ఆ దేశం పాక్ తో ఉన్న వాణిజ్యానికి గుడ్ బై చెప్పేసింది.
Also Read: Trump Vs Greenland: గ్రీన్ ల్యాండ్ విషయంలో ట్రంప్ పట్టుదల..యూరోపియన్ దేశాలపై భారీ సుంకాలు
Follow Us