/rtv/media/media_files/2026/01/17/trump-greenland-2026-01-17-10-54-34.jpg)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారీఫ్ ల బాంబ్ పేల్చనున్నారని తెలుస్తోంది. గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు సుంకాల బ్రహ్మాస్త్రం సంధించనున్నారు. గ్రీన్‌ల్యాండ్‌కు సంబంధించి అమెరికాను సమర్థించని దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలను విధించవచ్చని ట్రంప్ సూచించారు. గ్రీన్‌ల్యాండ్ సమస్యపై డోనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు చేసిన బలమైన హెచ్చరిక ఇదేనని చెబుతున్నారు.
Trump:
— Clash Report (@clashreport) January 16, 2026
I may put a tariff on countries if they don't go along with Greenland because we need Greenland for national security.pic.twitter.com/HPIHJWaEUy
ఆర్థిక ఒత్తిడి ఖాయం..
గ్రీన్ ల్యాండ్ విషయంలో సుంకాలను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి నేరుగా ప్రస్తావించారు. గ్రీన్‌ల్యాండ్ అమెరికా జాతీయ భద్రతకు చాలా ముఖ్యమైనదని, అందువల్ల దానిపై అమెరికా నియంత్రణ అవసరమని ఆయన వాదిస్తున్నారు. కానీ దీనికి డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్ తో పాటూ మిగతా యూరోపియన్ దేశాలు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నాయి. దీనిపై వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ..అమెరికా తన ప్రయోజనాలను సాధించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు. ఏదైనా దేశం అమెరికా ప్రణాళికకు మద్దతు ఇవ్వకపోతే సుంకాల ద్వారా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అమెరికా భద్రతా వ్యూహంలో గ్రీన్‌ల్యాండ్ ఒక ముఖ్యమైన భాగమని, దాని గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా తాను వెనుకాడనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో డెన్మార్క్ ను పెద్దగా పట్టించుకోమని చెప్పారు.
Trump mocks Macron again:
— Clash Report (@clashreport) January 16, 2026
I said, Emmanuel, "yes, Donald, Donald thank you so much for calling." I said you are not going to like this talk, you have to get your drug prices up, "no, no, no, no I will not do that!"
I said 100% you will do it. pic.twitter.com/F5xhoHRUBl
రీసెంట్ గా రిపబ్లికన్ పార్టీ 'గ్రీన్‌లాండ్ విలీనం రాష్ట్ర హోదా' అనే పేరుతో బిల్లును ప్రవేశపెట్టింది. ఆ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని రాండీ తెలిపారు. అమెరికా శత్రువులు ఆర్కిటిక్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తున్నాయని.. కానీ ఇలా జరగనివ్వమని అన్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా చేపడుతున్న ఈ చర్యలు ఎంతో కీలకమని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అనంతరం ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Didi VS BJP: మారుతున్న బెంగాల్ రాజకీయాలు..మమతా బెనర్జీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా..
Follow Us