Varun Tej: చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..! మెగా హీరో వరుణ్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన చిన్నతనం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చిన్న వయసులో తనను, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను క్రమశిక్షణలో ఉంచడానికి చిరంజీవి కర్రతో కొట్టేవారని సరదాగా చెప్పాడు. By Archana 08 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update mega hero's షేర్ చేయండి Varun Tej Interesting Facts About Chiranjeevi : గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ డిజాస్టర్స్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'మట్కా'. 1950, 1980 కాలం నాటి కథాంశంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వరుణ్ భిన్నమైన షేడ్స్ ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్ కర్రతో కొట్టేవారు.. ఇందులో భాగంగా హీరో వరుణ్, మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూస్, షోస్ లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తన చిన్నతనం గురించి పలు విషయాలను పంచుకున్నారు. చిన్న వయసులో తనను, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లను క్రమశిక్షణలో ఉంచడానికి చిరంజీవి కర్రతో కొట్టేవారని సరదాగా చెప్పాడు వరుణ్. సాధారణంగా సెలెబ్రెటీల పిల్లలు అనగానే అందరూ ఏదో ఊహించుకుంటారు. కానీ చిన్నతనంలో వాళ్ళు కూడా ఒక సాధారణ పిల్లల మాదిరిగా పెరిగినవారే. Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! ఈ చిత్రాన్ని వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి చౌదరీ, నోరా ఫతేహీ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. Also Read: పృథ్వీ- విష్ణు ప్రియా విడిపోయినట్లేనా..! ఇద్దరి మధ్య పెద్ద గొడవ Also Read: డైరెక్టర్ క్రిష్ ఇంట పెళ్లి సందడి.. అమ్మాయి మరెవరో కాదు..! #chiranjeevi #tollywood #varun tej మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి