Drugs: ఓర్నీ.. అక్కడ కూడా గంజాయి పెంచుతారా?.. వరంగల్ పోలీసుల షాక్! వరంగల్‌లో పోలీసులు స్నీఫర్ డాగ్‌ను తీసుకుని వచ్చి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ జాగిలం పరిగెత్తి వెళ్లి ఓ ఇంటి మేడపై పూలకుండీలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిని పట్టించింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. By Kusuma 08 Nov 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ఇటీవల వచ్చిన ఓ సినిమాలో ఇంటి మేడ పైన గంజాయి మొక్కలను పెంచుతున్న సీన్ నిజ జీవితంలోనూ జరిగింది. వరంగల్‌లో పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చి చెకింగ్‌లు చేస్తుండగా వారికి ఊహించిని షాక్ కనిపించింది. వరంగల్ సిటీలో గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు పోలీసులు కొత్తగా స్నీఫర్ డాగ్‌ను తీసుకొచ్చారు. దీన్ని తీసుకుని వరంగల్ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టగా.. ఆ స్నీఫర్ డాగ్ ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది. మేడపైన గంజాయి మొక్కలు పెంపకం చేస్తున్న వ్యక్తి అరెస్ట్.సులభంగా డబ్బు సంపాదించడంతో తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని గృహ పరిశ్రమగా ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలైనాడు.వివరాల్లోకి వెళితే వరంగల్ శివనగర్ ప్రాంతానికి… pic.twitter.com/lp12shldMv — Warangal Police (@warangalpolice) November 7, 2024 ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే? పూలకుండీల్లోనే గంజాయి మొక్కలు.. ఒక అతని ఇంటి మేడ వైపుకు పరిగెత్తింది. దీంతో పోలీసలు ఈ జాగిలం కొత్తది కావడం వల్ల గందరగోళానికి గురయ్యారు. కానీ ఆ మేడ ఎక్కిన తర్వాత వారు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ ఉద్యోగం చేస్తూనే, ఇంకా డబ్బులు సంపాదించాలని ఇంట్లోనే మేడపైన పూలకుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా? రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు అనుమానస్పదంగా ప్రయాణికుల సామానుతో పాటు, బ్యాగ్ లను పోలీసులు పోలీస్ జాగిలంటో తనిఖీ చేయించారు. దీంతో అతని యవ్వారం బయటపడింది. వెంటనే పోలీసులు ఆ గంజాయి మొక్కలను పెంచుతున్న యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం డబ్బు కోసమే ఇలా చేసినట్లు తెలిపాడు. వెంటనే అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేశారు. నగరంలో ఎవరైనా మత్తు పదార్థాలు వాడుతున్నా, అక్రమంగా కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్న, విక్రయిస్తున్న కూడా తక్షణమే 8712584473 ఈ నంబర్‌కు సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు తెలిపారు. ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక! #warangal #drugs #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి