/rtv/media/media_files/2025/10/08/pak-2025-10-08-13-48-39.jpg)
Rattled Pakistan's Defence Minister warns of "real risk" of war with India
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి గట్టి బదులిచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పాక్ బుద్ధి మారలేదు. తాజాగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఈసారి యుద్ధం జరిగే పరిస్థితులు వస్తే తామే గెలుస్తామంటూ మేకపోతు గాంభీర్యం మాటలు మాట్లాడారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను నేను కోరుకోవడం లేదు. కానీ భారత్ నుంచి ముప్పు పొంచి ఉందనేది వాస్తవం.
భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈసారి యుద్ధం జరిగితే మాత్రం గతంలో కన్నా మేము అనుకూల ఫలితాలు సాధిస్తాంటూ'' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఇటీవల భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ
ఇదిలాఉండగా ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీని గురించి మాట్లాడారు. '' భారత్ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ 1.0లాగా ఈసారి మేము సహనాన్ని ప్రదర్శించం. పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండాలనుకుంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే. లేకపోతే ఆ దేశం చరిత్రలో లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది జాగ్రత్తా'' అంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలంటూ సైనికులకు ఆదేశాలు చేశారు.