National Scholarship: రూ.50లతో రూ.48 వేల స్కాలర్‌షిప్.. లాస్ట్ డేట్ ఆరోజే.. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి!

ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50తో అప్లై చేసుకోవచ్చు. 

New Update
11

students

National Scholarship: ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్రం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవాలి. అయితే వారి కుటుంబ సంవత్సరం ఆదాయం రూ.3,50,000 లోపు మాత్రమే ఉండాలి. అలాగే ఏడో తరగతిలో 55 శాతం మార్కులు వస్తేనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కులు సడలింపు ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పాస్ పోర్టు సైజ్ ఫొటో కావాలి. బీసీ, ఓసీ విద్యార్థులు అప్లై చేసుకోవడానికి రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.50 తీసుకుంటారు. 

ఇది కూడా చూడండి: US Government Cancels OPT Program: అలా చేస్తే అమెరికా అడుక్కోవడం ఖాయం.. విదేశీ విద్యార్ధులపై కీలక నిర్ణయం!

నాలుగేళ్ల పాటు స్కాలర్‌షిప్..

పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయానికి సంప్రదించవచ్చు. అయితే ఈ స్కాలర్‌షిప్ నాలుగేళ్ల పాటు ఇస్తారు. ప్రతీ ఏడాది రూ.12 వేలు చొప్పున మొత్తం రూ.48 వేలు అందిస్తారు. ఈ స్కాలర్ ‌షిప్ కోసం పరీక్షను 7,8 తరగతి సిలబస్‌ల ఆధారంగా ఇస్తారు. తెలుగు, ఇంగ్లీషులో ఈ పరీక్ష రెండు విభాగాల్లో ఉంటుంది. మొదటి విభాగంలో మానసిక సామర్థ్యం, రెండో పేపర్‌లో విషయ సామర్థ్యంపై మల్టిపల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఒక్కో విభాగానికి 90 మార్కులు ఉంటాయి. మొత్తం 180 మార్కులతో పరీక్ష పేపర్ ఉంటుంది. అయితే ఈ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి నాలుగేళ్లు అనగా, తొమ్మిది, పది, ఇంటర్ వరకు స్కాలర్‌షిప్ ఇస్తారు. అది కూడా తొమ్మిదో తరగతిలో 55 శాతం, పదో తరగతిలో 60 శాతం, ఇంటర్‌లో 55 శాతం మార్కులు సాధిస్తేనే వస్తుంది. దీనికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 15 చివరి తేదీ. 

ఇది కూడా చూడండి: High Paying Jobs: ఫ్రెషర్లకు 5 బెస్ట్ జాబ్స్.. లక్షల్లో జీతం.. అనుభవం అవసరమే లేదు.. ఓ లుక్కేయండి!

Advertisment
తాజా కథనాలు