Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుఫున పోరాడుతున్న భారతీయుడు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్ ను ఉక్రెయిన్ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని నిర్థారించడానికి ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

New Update
russia war

రష్యా సైన్యంలో ఉన్న భారతీయుడు మొహ్మద్ హుస్సేన్ ప్రస్తుతం ఉక్రెయిన్ బందీగా ఉన్నాడు. ఈ 22 ఏళ్ళ గుజరాతీ చదువుకోవడానికి రష్యా వెళ్ళాడు. విద్యార్థి వీసాతో అక్కడ చదువును ప్రారంభించాడు. కానీ అక్కడకు వెళ్ళాక మాదక ద్రవ్యాల ఆరోపణలపై అరెస్ట్ అయ్యాడు. అతను చాలా కాలంగా రష్యాలోని జైల్లో ఉన్నాడు హుస్సేన్. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక జైల్లో ఖైదీలను రష్యా సైన్యంలో చేర్చుకుంది. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తే జైలు శిక్షను తప్పిస్తామని రష్యా ప్రభుత్వం చాలా మంది ఖైదీలకు ఆఫర్ ఇచ్చింది. హుస్సేను కూడా ఈ ఒప్పందంపై సంతకం చేసి ఉక్రెయిన్ తో యుద్ధానికి వెళ్ళాడు. కానీ మూడు రోజుల తర్వాత ఉక్రెయిన్ దళాలకు లొంగిపోయాడు. ప్రస్తుతం హుస్సేన్ వారి ఆధీనంలోనే ఉన్నాడని తెలుస్తోంది. 

యుద్ధం చేయడం ఇష్టం లేదు..

తాను కావాలనే ఉక్రెయిన్ కు లొంగిపోయానని చెబుతున్నాడు 22 ఏళ్ళ మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్. తనకు యుద్ధం చేయడం ఇష్టం లేదని...కానీ రష్యాలో జైలు శిక్షను తప్పించుకోవాలంటే మరొక మార్గం లేదని హుస్సేన్ చెప్పాడు. అందుకే తాను ఒప్పందం మీద సంతకం చేసి యుద్ధానికి వచ్చాని అంటున్నాడు. తరువాత కావాలనే ముడు రోజులు యుద్ధంలో పాల్గొన్నాక వెళ్ళి ఉక్రెయిన్ దళాలకు చిక్కానని తెలిపాడు. రష్యా ఫ్రంట్ లైన్ కు పంపే ముందు దాదాపు తనకు 16 రోజుల పాటూ శిక్షణ ఇచ్చారని హుస్సేన్ చెప్పాడు. కేవలం మూడు రోజులు పోరాటం తర్వాత, తాను ఉక్రేనియన్ దళాలకు లొంగిపోయానని, తనకు పోరాడే ఉద్దేశ్యం లేదని చెప్పానని అతను చెప్పాడు.కావాలనే రైఫిల్ ను పక్కన పెట్టేసి..తనకు సహాయం కావాలని అడిగానని హుస్సేన్ చెప్పాడు. 

వాస్తవికతను నిర్థారిస్తున్నాము..ఎమ్ఈఏ

ఉక్రెయిన్ దళాల చేతిలో భారతీయుడు బందీగా ఉన్నాడనే విషయాన్ని నిర్థారించడానికి తాము ప్రయత్నిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. కైవ్ లో ఉన్న భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించడానికి ట్రై చేస్తున్నామని తెలిపింది. అయితే ఉక్రెయిన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని చెప్పింది.

మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నెల ప్రారంభంలో డ్రోన్లు, భారీ క్షిపణులతో విరుచకుపడింది. దాంతో పాటూ వైమానికి బాంబులనూ ప్రయోగించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ లో ఐదుగురు మరణించగా..దాదాపు 20 మంది దాకా గాయపడ్డారు. కైవ్ లోని పౌరుల మౌలిక సదుపాయాలను రష్యా బాంబులు తాకాయని ఉక్రేనియన్ అధికారులు తెలిపారు. మాస్కో 53 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను, 496 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. అయితే దాడిలో తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ నివేదించారు.

Also Read: Rohith Sharma: నా నుంచి ఏం ఆశిస్తున్నారో అర్థమైంది..కెప్టెన్సీ తొలగింపుపై రోహిత్ స్పందన 

Advertisment
తాజా కథనాలు