Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  మండిపడ్డారు. ఇండియా, చైనాలను బెదిరించే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని పుతిన్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

New Update
Putin

Putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై  మండిపడ్డారు. ఇండియా, చైనాలను బెదిరించే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని పుతిన్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలతోనే పెట్టుకుంటున్నావని పుతిన్ అన్నారు. సుంకాలతో భారత్‌, చైనాలపై ఒత్తిడి ప్రయత్నాలు సరికాదని పుతిన్ తెలిపారు. శిక్షిస్తామని ఇండియా, చైనా వంటి పెద్ద దేశాలకు చెప్పేముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది చూసుకోవాలంటూ పుతిన్ ట్రంప్‌కు సూచించారు. ఆర్థిక దిగ్గజాలపై ట్రంప్ పెత్తనం చెల్లదని పుతిన్ అన్నారు.

ఇది కూడా చూడండి: Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్

వైఖరి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని..

ఇప్పటికైనా ట్రంప్ తన వైఖరిని మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని పుతిన్  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండియా, చైనాను వదిలిపెట్టకపోతే రష్యా రంగంలోకి వస్తుందని పుతిన్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ తరచుగా భారత్,  చైనాలపై భారీ సుంకాలు విధిస్తామని బెదిరించడం, ఆ దేశాల ఎగుమతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రకమైన ఒత్తిడి ప్రయత్నాలు సరికాదని, ఆర్థిక దిగ్గజాలపై ట్రంప్ పెత్తనం చెల్లదని ఆయన పేర్కొన్నారు. సుంకాల ద్వారా ప్రపంచ వాణిజ్య నియమాలను ఉల్లంఘించడం, పెద్ద దేశాలను బెదిరించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని పుతిన్ అన్నారు.

రంగంలోకి రష్యా వస్తుందని హెచ్చరిక

ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ విధానాలను భారత్, చైనాలపై ఇంకా కొనసాగిస్తే, రంగంలోకి రష్యా కూడా వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రష్యా, -చైనా, -భారత్ మధ్య బంధం బలంగా ఉంది. ఈ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే ప్రయత్నాలను రష్యా కూడా తీవ్రంగా మండిపడుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, శక్తివంతమైన దేశాలు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని పుతిన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ తన తీరు మార్చుకోకపోతే, అది అంతర్జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చూడండి: USA: రష్యా, చైనాలకు భయపడుతున్న ట్రంప్..సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు