USA: రష్యా, చైనాలకు భయపడుతున్న ట్రంప్..సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ఆదేశాలు

అమెరికాకు, ప్రపంచ దేశాలకు మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ట్రంప్ ఆదేశించారు.  ఘర్షణ కోరుకోవడం లేదు కానీ...ఏ సమయంలో అయినా రెడీగా ఉండాలని చెప్పారని తెలుస్తోంది.

New Update
hegseth

US President Donald Trump and US Secretary of Defense Pete Hegseth

 అమెరికా అధ్యక్షుడు భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు. భారత్ , చైనాలతో టారిఫ్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ రెండు దేశాలకు మద్దతుగా రష్యా నిలిచిది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మిగిలిన నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు భారత్ పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్ స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఎప్పుడైనా, ఐమైనా జరగొచ్చనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు జాగ్రత్త పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, చైనాలను అరికట్టేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖను ఆదేశించారని పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ తెలిపారు.వాషింగ్టన్ రెండు దేశాలతోనూ ఘర్షణను కోరుకోవడం లేదని, కానీ బలమైన నిరోధక వైఖరిని కొనసాగించాలని కోరుకుంటుందని ఆయన అన్నారు.

ఇవి కేవలం సన్నాహాలు మాత్రమే..

బీజింగ్ లో జరిగిన పరిణామాలపై హెగ్సెత్ మాట్లాడారు. చైనా ప్రభుత్వం నిర్వహించిన ఆయుధ ప్రదర్శన...దానికి రష్యా, ఉత్తర కొరియాల అధినేతలు హాజరవడం..అమెరికా లోపాలను ఎత్తి చూపించడం లాంటి విషయాలను ఆయన ఎత్తి చూపించారు. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ విధానాలు రష్యా, చైనాలను దగ్గర చేసిందని అన్నారు. దాని కారణంగానే అధ్యక్షుడు ట్రంప్ రక్షణ శాఖలో మమ్మల్ని సిద్ధంగా ఉండాలని, మన సైన్యాన్ని చారిత్రాత్మక మార్గాల్లో పునర్నిర్మించాలని ఆదేశించారని హెగ్సెత్ తెలిపారు. అమెరికా సన్నాహాలు కేవలం రక్షణాత్మకమైనవే తప్ప ఘర్షణలకు పురికొల్పేవి కావని స్పష్టం చేశారు. ఇవి కేవలం సన్నాహాలు మాత్రమే నని..అధ్యక్షుడు ట్రంప్ దౌత్యపరమైన చర్యలకే ప్రాముఖ్యతనిస్తున్నారని హెగ్సెత్ చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఆయనకు గొప్ప సంబంధం ఉంది. దానిని ఉపయోగించుకుని సమస్యల పరిష్కారానికి మార్గాలు కనుగొంటారని తెలిపారు. 

Also Read: PM Modi ON GST: పిల్లలు తినే చాకెట్ల పైనా పన్ను..జీఎస్టీ మార్పుల తర్వాత కాంగ్రెస్ పై మోదీ విమర్శ..

Advertisment
తాజా కథనాలు