/rtv/media/media_files/2025/08/15/trump-and-putin-2025-08-15-18-11-08.jpg)
Trump and Putin
యుద్ధం ముగించాలంటే తమకు కచ్చితంగా తూర్పున ఉన్న దొనెట్ స్క్ కావాల్సిందే అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ ఆ ప్రాంతం నుంచి పూర్తిగా వైదొలిగితేనే కాల్పులు విరమణకు అంగీకరిస్తామని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలస్కా భేటీ లో పుతిన్ ఈ కీలక డిమాండ్ ను ట్రంప్ ముందుంచారని చెబుతున్నారు. మరోవైపు ఈ భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ విషయమై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, యూరోపియన్ నేతలతో చర్చించారని సమాచారం. ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. కానీ దీనిని జెలెన్ స్కీ తిరస్కరించారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.
ఎక్కడుంది ఈ దొనెట్ స్క్...
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దే దొనెట్ స్క్. సరిహద్దుల్లో తూర్పు ఉక్రెయిన్ లో డాన్ బాస్ ఉంది. అందులో దొనెట్ స్క్, లుహాన్ స్క్ లు అంతర్భాగాలు. పారిశ్రామిక హబ్‌గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది. బొగ్గు నిల్వలు, ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది. అయితే ఈ ప్రాంతం ఎక్కువ భాగం రష్యాలోనే ఉంది. 2022లో ఈ ప్రాంతంలోకి చోచ్చుకుని వచ్చింది. ఇప్పుడు కేవలం 30 శాతం దొనెట్ స్క్ మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఇప్పడు దీన్ని కూడా పుతిన్ కావాలని పట్టుబడుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం..
అయితే రష్యా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ జెలెన్ స్కీ నో చెప్పేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా ఆంక్షలను ఒప్పుకునేది లేదని ఆయన అన్నారు. ఈరోజు ఉక్రెయిన్ లోని కైవ్ లో జరిగిన మీడియా సమావేశంలో రష్యా ప్రతిపాదనను తోసిపుచ్చారు. డాన్బాస్ భూభాగాన్ని రష్యాకు అప్పగిస్తే మొత్తం ఉక్రెయిన్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుందని ఆయన అన్నారు. ఇది భవిష్యత్ యుద్ధానికి మార్గం సుగమం చేస్తుందని..వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా మీద ఈజీగా అటాక్ చేయగలరని చెప్పుకొచ్చారు. అమెరికా ప్రత్యేక రాయబారి వెట్ కాఫ్ తో పుతిన్ సమావేశంలో ఈ డిమాండ్ ను ప్రతిపాదించారు. అయితే దీనిపై రష్యా వైఖరి స్పష్టంగా ఉన్నప్పటికీ...అమెరికా మాత్రం ఉక్రెయిన్ వైపే ఉందని జెలెన్ స్కీ చెప్పారు. ఆ ప్రదేశాన్ని తాము వదిలి వెళ్ళిపోవాలని యూఎస్ కూడా కోరుకోవడం లేదని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డాన్బాస్ ను అప్పగించమని ఎప్పటి నుంచో వత్తిడి తీసుకువస్తున్నారని...అదే కనుక చేస్తే భవిష్యత్తులో రష్యా దురాక్రమణను నిరోధించడానికి భద్రతా హామీలను కట్టబెట్టడం, చర్చలలో యూరోపియన్ దేశాలను చేర్చడం మరింత కష్టమవుతుందని జెలెన్ స్కీ తెలిపారు. 2014లో రష్యా క్రిమియాను ఇలాగే స్వాధీనం చేసుకుందని చెప్పారు.
Also Read: DharmaSthala: మృతదేహాలు కొట్టుకుపోయి ఉండొచ్చు..ధర్మస్థల సాక్షి భీమ