/rtv/media/media_files/2025/08/17/dharmasthala-2025-08-17-08-17-53.jpg)
DharmaStala
మృతదేహాలను నేనే ఖననం చేశాను. అవి ఇప్పుడు ఎందుకు దొరకడం లేదో తెలియడం లేదు అంటూ భీమ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను పాప ప్రజ్ఞ వెంటాడడం, కలలో మృతదేహాలు, అస్థిపంజరాలు కనిపించడంతోనే న్యాయస్థానం ముందుకు వచ్చానని మరోసారి చెప్పుకొచ్చారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని అన్నారు. అడవి దారి, రహదారి విస్తరణ, భారీ వర్షాలు, నేత్రావతీ నదీ తీరం కావడం వల్లనే మృత దేహాలు కొట్టుకుపోయి ఉంటాయని భీమా చెప్పారు. నేత్రావతి తీరం ఒక్కచోటలోనే 70 దాకా మృతదేహాలను పూడ్చి పెట్టానని చెప్పుకొచ్చారు.
ఆ ప్రదేశం మొత్తం మారిపోయింది..
నేత్రావతి తీరంలో ఇసుక మేటలు వేసింది. దాంతో పాటూ అప్పుడు మొక్కలుగా ఉన్నవి ఇప్పుడు వృక్షాలుగా మారాయి. అందువల్లనే కచ్చితమైన ప్రదేశాలు ఇప్పుడు కనిపించడం లేదని భీమ చెబుతున్నారు. ఖననం చేసే సమయంలో తనతో పాటూ మరికొందరు ఉన్నారని..వాళ్ళు కూడా సెట్ ముందుకు వస్తారని అన్నారు. ఇప్పటికే 16 ప్రాంతాలు చూపించానని మరో 25 దాకా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
మరోవైపు భీమ మృతదేహాలను పూడ్చి పెట్టడం తాము చూశామని మరికొంత మంది సాక్షులు సెట్ ముందుకు వచ్చారు. తుకారామ గౌడ, పాండురంగ అనే వ్యక్తులు 2009లో భీమతో పాటూ తాము కూడా మృతదేహాలు ఖననం చేయడానికి సహాయంగా వెళ్ళామని తెలిపారు. అయితే తాము అప్పుడు చూసిన భీమకు, ఇప్పుడు మాస్కు వేసుకున్న వ్యక్తికి పోలీకలు కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కానీ మృతదేహాలను పూడ్చి పెట్టిన చోటు చూపించడానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేత్రావతి నదీ తీరంలో ఒక మృతదేహాన్ని ఖననం చేయడం వెనుక స్థానిక పోలీసు అధికారి ఒకరు ఉన్నారని మరో ధర్మస్థల వాసి పురందర గౌడ ఆరోపించారు. ఈ పాతికేళ్లలో నేత్రావతి తీరంలో జరిగిన అభివృద్ధి పనులతోనే మృతదేహాలను ఖననం చేసిన ప్రాంతాన్ని కచ్చితంగా గుర్తించడంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఒకరోజు సాయంత్రం తాను మృతదేహాన్ని గుంతలో పూడ్చడం చేశానని పురందర గౌడ్ చెప్పారు. అప్పుడే ఆ విషయం చెప్పడానికి భయపడ్డానని..కానీ ఇప్పుడు సెట్ ను ఏర్పాటు చేయడంతో ధైర్యంగా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు.
Also Read: Indo-China: సరిహద్దు సమస్యలపై చర్చలు..చైనా విదేశాంగ మంత్రి ఇండియాకు