మమ్మల్ని క్షమించండి.. విమాన ప్రమాదంపై పుతిన్

అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. అజర్‌బైజన్ దేశధానేతకు క్షమాపణలు కోరారు.

New Update
Plane crash and Putin (file Photos)

Plane crash and Putin (file Photos)

అజర్‌ బైజన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్థాన్‌లో కూలిపోవడంతో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అజర్‌బైజన్ దేశధానేతకు క్షమాపణలు కోరారు. గ్రోజ్నీలో ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడులను రష్యా దళాలు తిప్పికొడుతున్నాయని క్రెమ్లిన్ పేర్కొంది.

Also Read: నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించండి: తండ్రి విజ్ఞప్తి!

ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 25న అజర్‌బైజాన్‌లోని బాకు సిటీ నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ఆ విమానం ప్రయాణిస్తోంది. ఈ క్రమంలోనే కజకిస్థాన్‌లో ల్యాండింగ్‌ అయ్యేటప్పుడు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఎదుర్కొనేందుకు గ్రోజ్నీ సమీపంలో రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులు ప్రయోగిస్తున్నట్లు క్రెమ్లిన్ చెప్పింది. 

అయితే తాము ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి విమానాన్ని తాకినట్లు స్పష్టంగా చెప్పలేదు. కానీ రష్యా క్షిపణి తాకడం వల్లే విమానం కూలిందని ఉక్రెయిన్ ఆరోపించింది. అలాగే అజర్‌బైజాన్ కూడా ఉక్రెయిన్ వాదనను సమర్థించింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. అజర్‌బైజాన్ దేశాధినేత ఇల్హామ్ అలీయేవ్‌కు క్షమాపణలు చెప్పారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు