AP : నటుడు పోసాని అరెస్ట్.. కారణాలివే..

నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కులాల పేరుతో దూషించడం.. ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై కేసు నమోదు చేశారు. రాజంపేట అడ్మినిస్ట్రేషన్ ఎదుట పోసానిని పోలీసులు హాజరుపర్చనున్నారు. 

New Update

వైసీపీ అధికారంలో నోటికొచ్చినట్టు మాట్లాడినవారు, తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినవారి తాట తీస్తోంది ఇప్పటి ప్రభుత్వం. ఇందులో భాగంగా పోసాని కృష్ణమురళిని ఈరోజు ఏపీ రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత పోసానిని ఏపీకి తరలిస్తున్నారు. అక్కడ రాజంపేట అడ్మినిస్ట్రేషన్ ఎదుట ఆయనను హాజరుపర్చనున్నారు. అయితే తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదం పెట్టుకున్నారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను  పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. 

పోసానిపై పలు జిల్లాల్లో కేసులు..

నటుడు, వైసీపీ నేత అయిన పోసాని కృష్ణమురళిపై పలు కేసులు నమోదయ్యాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఏపీఎఫ్టీవీడీసీ ఛైర్మన్ గా ఉండేవారు. ఆ టైమ్ లో ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మీదనే కాక ఐటీ మినిస్టర్ లోకేశ్ ను కూడా అసభ్యకరంగా దూషించారు అంటూ ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాదు సినీ పరిశ్రమలో ఉన్నవారిపైన కూడా పోసాని హద్దులకు మించి విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. వీటితో పాటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎస్ నాయుడిని ఏకవచనంతో సంబోధించడమే కాకుండా...తిరుపతి కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై బాపట్ల, అనంతపురం, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో స్థానికులు ఆయనపై ఫిర్యాదులు చేశారు. వీటిని ఆధారంగా చేసుకుని పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: కేంద్రం VS తమిళనాడు.. రోజురోజుకి ముదురుతున్న హిందీ వివాదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు