పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రత్యేక దేశం దిశగా మరో ప్రావిన్స్..!

పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్‌ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.

New Update

ఇండియా శత్రు దేశం పాకిస్తాన్‌కు ప్రతిరోజు దీపావళి పండగే అవుతుంది. జమ్మూ కశ్మీర్, ఉగ్రవాదంపై పాక్‌పై భారత్ యాక్షన్ తీసుకుంటున్న సమయంలోనే ఆ దేశంలోని కొన్ని ప్రావిన్స్ తిరుగుపాటుకు తెరలేపాయి. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ ప్రావిన్స్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తాజాగా సింధ్ ప్రావిన్స్ ప్రజలు కూడా ప్రత్యేక దేశంగా  ఉంటామని ఆందోనలు చేస్తున్నారు.

సింధ్ ప్రావిన్స్‌ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని భారీ ధర్నాలు, ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి.  జై సింధ్‌ ఫ్రీడమ్ మూవ్‌మెంట్ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తు్న్నారు. పాక్ సైనం హత్యలు, బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి, మానవ హక్కుల సంస్థలు కలగజేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

(pakistan | Sindh province | india pak war | india | separate | latest-telugu-news | protests)

Advertisment
తాజా కథనాలు