/rtv/media/media_files/2026/03/01/ali-khamenei-2026-03-01-17-04-22.jpg)
Ali Khamenei
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మృతితో హైదరాబాద్(hyderabad) లోని పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయి. పురాని హవేలీలోని తంజీమ్ ఈ జాఫెరీ అనే సంస్థ ఖమేనీ మృతికి సంతాపంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది. భారీ సంఖ్యంలో రోడ్ల పైకి వచ్చిన ముస్లింలు ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఓల్డ్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖమేనీ మృతితో హైదరాబాద్‌లో నిరసనలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలాఉండగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి శనివారం చేపట్టిన దాడుల్లో అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, కోడలు, మనుమడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.
Also Read: ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
Iran Supreme Leader Ali Khamenei Is Death
ఖమేనీ ఇంటిని లక్ష్యంగా చేసుకున్న అమెరికా, ఇజ్రాయెల్ తమ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. దీంతో ఖమోనీ ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది. ముందుగా ఖమేనీ సురక్షితంగా ఉన్నారని.. ఈ దాడులకు ముందే ఆయని సేఫ్ ప్లేస్‌కి తరలించినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున ట్రంప్.. ఖమేనీ మృతి చెందినట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఇరాన్(iran us war) మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని బడ్‌గామ్‌లో కూడా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా షియా ముస్లింలు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. - international news in telugu
ఖమేనీ హత్యపై బడ్‌గామ్‌లో నిరసనలు
— greatandhra (@greatandhranews) March 1, 2026
జమ్మూ కాశ్మీర్‌లోని బడ్‌గామ్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా శియా ముస్లింలు ఆందోళన చేపట్టారు.#AliKhamenei#JammuKashmir#Budgam#ShiaMuslimspic.twitter.com/bHFilTyiJB
Follow Us