/rtv/media/media_files/2026/03/01/alireza-arafi-appointed-as-iran-interim-supreme-leader-2026-03-01-16-42-22.jpg)
Alireza Arafi Appointed as Iran Interim Supreme Leader
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరిపిన దాడుల్లో(iran us war) ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(ayatollah-ali-khamenei) మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరెజా అరాఫీ నియమితులయ్యారు. ఈయన ఖమేనీకి చెందిన అత్యంత సన్నిహిత వర్గంలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ నియామకం అనంతరం అరాఫీ.. ముగ్గురు సభ్యుల లీడర్షిప్ కౌన్సిల్లో చేరారు.
Also read: ఇరాన్-అమెరికా యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
అలిరెజా అరాఫీ ఎవరు ?
అలిరెజా అరాఫీ(Alireza Arafi) ఇరాన్ మత, రాజకీయ వ్యవస్థల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు. 1959లో ఇరాన్‌లోని యజ్ద్ ప్రావిన్స్‌లోని మెయ్బోద్లో ఈయన జన్మించారు. అలిరెజా తండ్రి మొహమ్మద్ ఇబ్రహీం అల్-అరాఫీ, ఇరాన్ విప్లవ పితామహుడు అయాతుల్లా ఖొమేనీకి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. ప్రస్తుతం అలిరెజా ఇరాన్ చట్టాలను సమీక్షించే 'గార్డియన్ కౌన్సిల్' సభ్యుడిగా, అలాగే సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అలాగే ఇరాన్‌లోని అన్ని షియా మత విద్యాసంస్థలకు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో 'అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ' ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇరాన్ స్వచ్ఛంద పారామిలిటరీ దళమైన 'బసీజ్'కు అధిపతిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. మతపరమైన విద్యలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉండటం, షియా ముస్లింలలో ఆయనకు మంచి గుర్తింపు ఉన్న కారణంగా ఈ పదవికి ఎంపికైనట్లు తెలుస్తోంది.
అయితే అరాఫీ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా కొంతకాలం మాత్రమే ఉండనున్నారు. మరికొన్ని రోజుల తర్వాత ఈ నాయకత్వాన్ని వేరే వాళ్లకి అప్పగించే ఛాన్స్ ఉంది. మరీ ఈ తాత్కాలిక నాయకత్వంలో ఇరాన్లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ప్రతికార దాడులు చేస్తోంది.
Follow Us