/rtv/media/media_files/2025/07/22/sexual-harassment-2025-07-22-13-33-45.jpg)
Sexual harassmentin in girls hostel
Sexual Harassment:
నారాయణఖేడ్ బీసీ బాలికల హాస్టల్(Narayankhed BC Girls Hostel) విద్యార్థినీలు మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్ రాజేష్ చవాన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ మేరకు అర్థరాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న విద్యార్థినీలు రాజేష్ పై ఫిర్యాదు చేశారు. సాంఘీక సంక్షేమ శాఖ బీసీ బాలికల వసతి గృహం లో విద్యార్థినులపై వార్డెన్ శారద కుమారుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నాడని విద్యార్థినీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ విషయాన్ని బాలికలు వార్డెన్, హాస్టల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నారాయణఖేడ్ పోలీసులకు బాలికలు ఫిర్యాదు చేశారు.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
అటు అధికార పార్టీ యువనేత.. ఇటు తల్లి వార్డెన్ అండ చూసుకుని రాజేష్ ప్రతి రోజూ తాగి హాస్టల్‌కు వచ్చి బాలికలపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ ప్రవర్తన పట్ల ఆయన తల్లి శారదకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అలాగే సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్తే అన్నలాంటి వాడే ఏం పర్వాలేదు అంటూ బాలికలను తిడుతున్నారన్నారు. రాజేష్ చవాన్ నిత్యం హాస్టల్‌లోకి ప్రవేశించి, తాము నిద్రపోతున్నప్పుడు అనుచితంగా తాకడం, ఫోటోలు తీయడం చేస్తున్నారని విద్యా్ర్థినీలు ఆరోపించారు.దీంతో ఆ బాలికలు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థుల నుండి వాంగ్మూలాలు నమోదు చేయడానికి మంగళవారం హాస్టల్‌ను తనిఖీ చేయనున్నారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే