/rtv/media/media_files/2025/02/14/7jDF2S2WVY8yzSPDBlPY.jpg)
elon musk modi Photograph: (elon musk modi)
ఎలాన్ మస్క్ సంతానానికి ప్రధాని మోదీ అమూల్యమైన బహుమతులను అందజేశారు. విష్ణుశర్మ నీతికథలు ‘పంచతంత్ర’ అందులో ప్రముఖమైనది. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘క్రిసెంట్ మూన్’, ది గ్రేట్ ఆర్కే నారాయణన్ కలెక్షన్స్’లను కూడా అందించారు. గురువారం వాషింగ్టన్ డీసీలోని బ్లెయిర్‌హౌ్‌సలో మస్క్ తన భాగస్వామి షివోన్ జిలిస్, ముగ్గురు పిల్లలతో తనను కలిసినప్పుడు.. తానిచ్చిన పుస్తకాలను ఆ పిల్లలు చదువుతున్నప్పటి ఫొటోలను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మస్క్‌తో అంతరిక్షం, మొబిలిటీ, టెక్నాలజీ, ఆవిష్కరణలపై తాను చర్చించానన్నారు.
సిరామిక్ టైల్స్...
కనిష్ఠ ప్రభుత్వం.. గరిష్ఠ పాలన’ సూత్రాల ఆధారంగా దేశ పాలనకు కొత్త రూపు ఇచ్చేందుకు చేస్తున్న కృషిని వివరించినట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ కూడా ప్రధాని మోడీకి అరుదైన బహుమతి అందించారు. తన స్పేస్‌ఎక్స్ రాకెట్ హీట్‌షీల్డ్ టైల్‌ను కానుకగా ఇచ్చారు. షడ్బుజాకారంలో ఉండే ఈ సెరామిక్ టైల్స్.. అంతరిక్షంలోకి వెళ్లిన రాకెట్ తిరిగి భూమి మీదకు వచ్చే క్రమంలో కీలకంగా మారతాయి. రాకెట్ తిరిగి భూవాతవరణంలోకి వచ్చే సమయంలో విపరీతమైన ఘర్షణ ఏర్పడే సంగతి తెలిసిందే. ఆ సమయంలో దాని నుంచే పుట్టే వేడి నుంచి ఈ సిరామిక్ టైల్స్ దానిని రక్షిస్తాయి.
Also Read: Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్ ఉందబ్బా!
It was also a delight to meet Mr. @elonmusk’s family and to talk about a wide range of subjects! pic.twitter.com/0WTEqBaVpT
— Narendra Modi (@narendramodi) February 13, 2025
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ గురువారం వాషింగ్టన్‌లో ఎలన్ మస్క్ ఫామిలీని కలిశారు. ఎలన్ మస్క్, ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. వారికి ఇండియా నుంచి తీసుకెళ్లిన గిఫ్ట్‌లు కూడా ఇచ్చారు ప్రధాని మోదీ.
ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ఇంఛార్జ్‌గా ఎలన్ మస్క్‌కు ట్రంప్ బాధ్యతలు అప్పించారు. దీంతో అమెరికా అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో ఎలన్ మస్క్‌ను మోదీ కలిసినప్పుడు ఓ విలువైన గిఫ్ట్ ఇచ్చాడు. దాని గురించి ప్రసెంట్ ఇంటర్‌నెట్‌లో చర్చ జరుగుతోంది. చూడడానికి మామూలుగా ఉన్న అది చాలా విలువైనది. వేల కోట్లుకు అధిపతి అయిన ఎలన్ మస్క్ ఓ దేశ ప్రధానికి బహుమతి ఇచ్చాడంటే అది చాలా విలువైనదే అని కొందరు భావిస్తున్నారు. ఎలన్ మస్క్ మోదీకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..
ఎలన్ మస్క్‌కు స్పేస్‌ఎక్స్ అనే అంతరిక్ష సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ హీట్ షీల్ట్ టైలే ఎలన్ మస్క్ భారత ప్రధాని నరేంద్ర మోదీ బహుమతిగా ఇచ్చాడు. అది ఓ అరుదైన మెటల్‌తో చేసిన పరికరం. స్టార్‌షిప్ హీట్‌షీల్డ్ టైల్స్ అనేవి షట్కోణ సిరామిక్ టైల్స్, వాతావరణంలో మార్పుల నుంచి రాకెట్‌ను రక్షించడానికి తయారు చేస్తారు. అంతరిక్షంలో వేగంగా ప్రయాణించే రాకెట్‌ను తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి ఈ సిలికా ఆధారిత సిరామిక్‌తో తయారు చేసిన స్పేస్ షటిల్ టైల్ కాపాడుతుంది. ఇవి అంతరిక్ష నౌకలకు వేడి అంతటా ఒకేలా ప్రసరింపుజేసేలా చేస్తాయి. అంతేకాదు రాకెట్‌ను కూల్ చేస్తాయి. అదే ఇప్పుడు ఎలన్ మస్క్ ప్రధాని మోదీకి బహుమతిగా ఇచ్చాడు. ఎలన్ మస్క్ టెక్, స్పేస్ సంబంధించిన అంశాలపై ఆసక్తిగా ఉంటాడు.
Also Read: Prayagraj Road Accident: మహాకుంభమేళాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి