PM Modi: న్యూ ఆర్లీన్స్‌లో ఉగ్రదాడి.. ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్

అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో వాహనం జనాలపైకి దూసుకెళ్లిన దాడిపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

New Update
PM Modi (file Photo)

PM Modi (file Photo)


అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వేగంగా వాహనంతో జనాలపైకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయయ్యాయి. ఈ దాడి వెనుక ఉగ్రకోణం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ దాడిని ఆయన ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.  '' న్యూ ఆర్లీన్స్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో మరణించిన బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నామని'' తెలిపారు.   

Also Read: మనమందరం సిగ్గు పడాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
 
ఇదిలాఉండగా న్యూఆర్లీన్స్‌లో జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ కూడా తాజాగా విడుదలయ్యాయి. రోడ్డుపై జనాలు వెళ్తుండగా.. ఒక్కసారిగా వాహనం వేగంగా దూసుకెళ్లింది. రోడ్డుపై వెళ్తున్న వాళ్లలో ఈ దాడి నుంచి తప్పించుకోగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలయయ్యాయి. దాడికి ఉపయోగించిన ట్రక్కులో ISIS జెండా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే నిందితుడు షంసుద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. ఇతడు ఐసిస్ ఉగ్రవాదిగా భావిస్తున్నారు.

Also Read: UN: ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్

అయితే షంషుద్దీన్‌ జబ్బార్‌ న్యూ ఆర్లిన్‌లో దాడి చేస్తాడని కొన్ని గంటల ముందే FBI వద్ద సమాచారం ఉన్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ చెప్పినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. అంతేకాదు జబ్బార్ సోషల్ మీడియాలో ఐసిస్‌కు అనుకూలంగా పోస్టు చేసి.. హింసకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయితే జబ్బార్‌ను ఐసిస్ లోన్‌ ఉల్ఫ్‌గా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు