Pak Air Strike: పాక్ ఎయిర్ స్ట్రైక్.. 30 మంది దుర్మరణం!

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫంఖ్తువాలో పాక్ ఎయిర్‌ ఫోర్స్‌ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు 30 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మాత్రే దారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి.

New Update
Pakistan’s Tirah Valley Explosions Leave 30 Dead

Pakistan’s Tirah Valley Explosions Leave 30 Dead

పాకిస్థాన్‌(pakistan) లోని ఖైబర్‌ ఫంఖ్తువాలో తిరా లోయలోని పాక్ ఎయిర్‌ ఫోర్స్‌(Pak Airforce) వైమానిక దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు 30 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మాత్రే దారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. తెహ్రికీ తాలిబన్ పాకిస్థాన్ (TTP) ముష్కరులే లక్ష్యంగా పాక్‌ సైన్యం ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమయ్యాయి. పాక్ సైన్యం JF 14 థండర్‌ జెట్లను ప్రయోగించాయి. జనావాసాలు ఉన్న ప్రాంతాల్లోనే ఎనిమిది బాంబు దాడులు జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. 

Also Read :  ఇంచ్ కూడా ఇవ్వము..ట్రంప్ బెదిరింపులను రిజెక్ట్ చేసిన తాలిబన్

Pakistan’s Tirah Valley Explosions

స్థానికులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ వైమానిక దాడులు పాక్ సైన్యమే చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన పాక్ ఆర్మీ మాత్రం ఈ దాడులకు తమ బాధ్యత లేదని కొట్టిపారేసింది. మెత్రా దారా గ్రామంలోని ఓ ఇంట్లో ఖవార్జీ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను నిల్వచేశాయని.. వాటివల్లే పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పాక్‌ మిలటరీ ప్రతినిధి తెలిపారు.   

Also Read :  H-1B వీసా ఫీజుల పెంపునకు కారణం అదే.. !

Advertisment
తాజా కథనాలు