/rtv/media/media_files/2025/12/17/imran-khan-sons-2025-12-17-17-39-09.jpg)
Imran Khan's Sons On His Psychological Torture In Pakistan Jail
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండేళ్లకు పైగా జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కొడుకులు ఖాసీం, సులేమాన్ ఖాన్‌లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రితో మాట్లాడి చాలా నెలలు అయినట్లు వాపోయారు. ఆయన్ని జైల్లో మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారంటూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. '' మా నాన్నను రెండేళ్లకు పైగా నిర్బంధ గదిలో ఉంచారు. ఆయనకు మురుగు నీటిని ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉంటున్నాడు. అక్కడి జైల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆయనకు ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏకాంతంగా ఉంచారు.
మా నాన్నను బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు. కానీ మాకు నమ్మకం మాత్రం ఉంది. పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఆయన్ని మళ్లీ ఎప్పటికీ చూడలేమేనని ఆందోళన చెందుతున్నామని'' ఖాసీం అన్నారు. సులేమాన్ మాట్లాడుతూ '' మా నాన్న ఒక రోజులో ఎక్కువసేపు నిర్బంధ గదిలోనే ఉంటున్నారు. ఆయన పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు ఇటీవలే సైనికాధికారులు చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం ఉందని'' అన్నారు.
Imran Khan’s sons, Kasim & Sulaiman, say they’re worried they’ll never see their father again and described his conditions in prison as a “death cell”. Watch my full interview on YouTube and my show at 9pm UK time on @SkyNews pic.twitter.com/rfRO8A3hBu
— Yalda Hakim (@SkyYaldaHakim) December 16, 2025
Also Read: మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్ 5 కీలక ఒప్పందాలు ఇవే!
ఇటీవల ఇమ్రాన్‌ఖాన్ జైలులో మృతి చెందినట్లు ప్రచారం రావడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆయన బాగానే ఉన్నట్లు తెలిసింది. దీంతో అప్పటినుంచి ఇమ్రాన్‌ను కలిసే అవకాశం కల్పించాలని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం అడియాలా జైలు ముందు నిరసనలు తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మా ఖానుమ్ కూడా ఇటీవల ఆయన్ని కలిశారు. ఆయన జైల్లో సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదిలాఉండగా ఇమ్రాన్‌ఖాన్‌ను పలు అవినీతి కేసుల్లో 2023 మే 9న అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. రెండ్రోజుల తర్వాత ఈ అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఆయన విడుదలయ్యారు. ఆ తర్వాత మళ్లీ తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో వెంటనే పోలీసులు ఆయన్ని అదే ఏడాది ఆగస్టు 5న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు.
Also Read: కిడ్నాపర్లను పట్టించిన స్మార్ట్‌వాచ్.. చిన్న తప్పుతో అందరూ జైలులోకి
Follow Us