Pakistan PM: ట్రంప్‌తో పాక్ ప్రధాని రహస్య భేటీ.. ఎందుకంటే?

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది.

New Update
Pakistan strikes deal with Trump family-backed crypto venture

Pakistan strikes deal with Trump family-backed crypto venture

పాకిస్తాన్(pakistan) ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) తో రహస్యంగా చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో మునీర్ పాల్గొనలేదని కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

నిజానికి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య 36 సెకన్ల పాటు మాత్రమే సంభాషణ జరిగింది. ఇది ఓ ముస్లిం దేశాధినేతల సమావేశం సందర్భంగా జరిగింది. ఈ స్వల్పకాలిక సంభాషణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భేటీలో పాకిస్తాన్ తరపున షెహబాజ్ షరీఫ్ మాత్రమే పాల్గొన్నారని, మునీర్ లేకపోవడం పాకిస్తాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలకు దారి తీస్తుందనే ఊహాగానాలకు కారణమైంది.

Also Read :  ట్రంప్ కు ఎదురుదెబ్బ..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై కోర్టుకు వెళ్ళనున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్

Pakistani PM Meeting With US President Trump

అయితే, మునీర్ గతంలో జూన్, ఆగస్టు నెలల్లో అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. జూన్ పర్యటనలో మునీర్‌కు ట్రంప్ వైట్ హౌస్‌లో విందు ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక అభివృద్ధిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి. ఆ తరువాత అమెరికా పాకిస్తాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సహాయం చేస్తామని ప్రకటించింది. అలాగే, పాకిస్తాన్‌కు ఖనిజ రంగంలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడిని కూడా అమెరికా అందించింది. ఈ పరిణామాలు పాక్-అమెరికా సంబంధాల్లో గణనీయమైన మార్పును సూచిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఐతే, తాజా సమాచారం ప్రకారం, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Pakistan PM Shabaz Sharif) భారత్‌(india) తో చర్చల కోసం ఆసక్తి చూపడం, అదే సమయంలో అమెరికాతో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, మునీర్ భేటీకి గైర్హాజరవడంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పాక్ అంతర్గత రాజకీయాల్లో నెలకొన్న అస్థిరతపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఒక కీలక మలుపు అవుతుందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read :  పాక్ ప్రధాని , ఆర్మీ చీఫ్ లకు అవమానం... వైట్ హౌస్ లో ఉండి వెయిట్ చేయించిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు