Pak-Afghanistan: మరో గాజాగా అఫ్ఘనిస్తాన్.. బయటపడ్డ పాక్ అసలు కుట్ర!

ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్‌ స్థావరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది.

New Update
Pakistan- Afghanistan

Pakistan- Afghanistan

ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి అఫ్గాన్‌ స్థావరాలను పాకిస్థాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది. బుధవారం నాటికి అఫ్గాన్‌లోని ఖోస్ట్, కాందహార్‌లోని సరిహద్దుకు సమీపంలో ఉన్న నివాస ప్రాంతాలపై దాడులకు దిగింది. అయితే పాక్ సైనిక దాడిలో 15 మందికి పైగా అఫ్గానిస్థానీయులు మరణించారు. 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. 

Also Read: మోదీ ట్రంప్‌కు భయపడ్డారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

గత వారం రోజుల నుంచి ఇరుదేశాల మధ్య ఘర్షణ జరుగుతోంది. అయితే ఆఫ్గనిస్థాన్‌ను గాజాగా మార్చాలనే ఉద్దేశంతో పాక్‌ నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందనే ప్రచారం నడుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే బుధవారం ఉదయం అఫ్గాన్‌లోని ఖోస్ట్‌లో జాజీ మైదాన్ ప్రాంతంలో పాక్‌ సైన్యం డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల ప్రభావానికి 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

Also Read: యో చూసుకోబడ్లా.. లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు - కోర్టు మొత్తం షాక్

మరోవైపు కాందహార్‌లోని స్పిన్ బోల్డక్‌ సరిహద్దు వద్ద నివాస ప్రాంతాలపై కూడా పాక్‌ సైన్యం డ్రోన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో 15 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు గురువారం కాబుల్‌లో భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుకు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని అఫ్గాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. చమురు ట్యాంకర్‌ వల్ల పేలుడు సంభవించిందని తెలిపింది.  

Also Read: ఇండియన్స్ తీసుకునే ఫుడ్ వెరీ డేంజర్.. ICMR షాకింగ్ ప్రకటన!

Advertisment
తాజా కథనాలు