Rahul Gandhi: మోదీ ట్రంప్‌కు భయపడ్డారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రధానీ మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.

New Update
Rahul Gandhi jabs PM over halt on Russia oil buys claim

Rahul Gandhi jabs PM over halt on Russia oil buys claim

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌ వ్యాఖ్యలపై విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానీ మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారంటూ సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలోనే పలు ప్రశ్నలను అడుగుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు.    

Also Read: యో చూసుకోబడ్లా.. లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు - కోర్టు మొత్తం షాక్

'' ప్రధాని మోదీ ట్రంప్‌కు భయపడుతున్నారు. భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని ట్రంప్ ప్రకటించేందుకు ప్రధాని పర్మిషన్ ఇచ్చారు. అమెరికా తిడుతున్నప్పటికీ కూడా వాళ్లని అభినందిస్తూ శుభాకాంక్షల సందేశాలు పంపుతున్నారు. ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను కూడా క్యాన్సెల్ చేశారు. ఈజిప్టులో షర్మ్‌ఎల్‌ షేక్‌లో గాజా శాంతి ఒప్పందం కార్యక్రమానికి కూడా ప్రధాని మోదీ వెళ్లలేదు. ఆపరేషన్ సిందుర్‌ విషయంలో ట్రంప్‌ ప్రకటనలను ఆయన ఖండించలేదని'' రాహుల్‌ ఎక్స్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: ఆ ర్యాంకింగ్ లో చైనాను దాటేసిన భారత్.. అమెరికా, రష్యాల తర్వాత..

Advertisment
తాజా కథనాలు