/rtv/media/media_files/2025/06/22/dri-seized-cocaine-2025-06-22-18-22-15.jpg)
DRI Seized cocaine valued 11.39 crores in Mumbai Airport
ఈ మధ్యకాలంలో విదేశాల నుంచి అక్రమంగా బంగారం, మాదక ద్రవ్యాలు తరలించే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలావరకు నిందితులు ఎయిర్‌పోర్టుల్లోనే పట్టుబడుతున్నారు. అయితే తాజాగా సినిమా రేంజ్‌లో ఓ ఘటన జరిగింది. మంబై ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు ఏకంగా రూ.11.39 కోట్ల కొకైన్‌ను సీజ్ చేశారు. వ్యక్తి కడుపులో 67 కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు సియోరాలియోన్ దేశం నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. సినిమా తరహాలో నిందితుడు కొకైన్ క్యాప్సుల్స్ మింగి రావడాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. జూన్ 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: ఎయిరిండియాకు తప్పని కష్టాలు.. బాంబు బెదిరింపుతో రియాద్‌కు దారి మళ్లింపు
ముందుగా నిందితుడిని తనిఖీ చేసిన అధికారులకు ఎలాంటి మాదక ద్రవ్యాలు కనిపించలేదు. కానీ అతడి ప్రవర్తనలో మాత్రం తేడాగా ఉంది. దీంతో అధికారులకు అనుమానం మరింత పెరిగింది. చివరికీ అతడికి ఎక్స్‌రే, స్కానింగ్ తీశారు. అందులో అతడు 67 కొకైన్ క్యాప్సుల్స్ మింగినట్లు గుర్తించారు. ఆ తర్వాత వైద్యులు సర్జరీ చేసి వాటిని బయటికి తీశారు. మొత్తం 1139 గ్రాముల కొకైన్ లభ్యమైనట్లు తెలిపారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.11.39 కోట్లు ఉంటుందని డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు.
Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం....అమెరికాలో హై అలెర్ట్...
Based on specific intelligence regarding an Ivory Coast national suspected of smuggling narcotics into India, officers of DRI Mumbai intercepted a male passenger who had arrived at Mumbai Airport from Sierra Leone on 19th June. The pax admitted to having ingested capsules… pic.twitter.com/owdthZ6z6v
— ANI (@ANI) June 22, 2025