Pak-Bangladesh: బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ మధ్య మరో సంచలన డిఫెన్స్‌ డీల్..

ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌ షోలో పాకిస్థాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్‌ బ్లాక్‌-3 ఫైటర్‌ జెట్‌లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. అయితే అది బంగ్లాదేశ్‌ అని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

New Update
Pak-Bngladesh Defense deal

Pak-Bngladesh Defense deal

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌ షోలో పాకిస్థాన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్‌ బ్లాక్‌-3 ఫైటర్‌ జెట్‌లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. ఆ దేశం ఏంటీ అనేదానిపై తాజాగా క్లారిటీ వచ్చింది. అది బంగ్లాదేశ్‌ అని పలు నివేదికలు సూచిస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక పాక్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు రోజురోజుకి మెరుగుపడుతున్నాయి. చైనా, పాక్‌తో కలిసి బంగ్లాదేశ్ రక్షణ సహకారాన్ని పునరుద్ధరించేందుకు తాత్కాలిక చర్యలు కూడా తీసుకుంటుంది. 

Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

ఇలాంటి సందర్భంలో JF 17 లాంటి ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు చేయడం బంగ్లాదేష్‌ ఎయిర్‌ఫోర్స్‌కు కీలకంగా మారనుంది. డిఫెన్స్‌ సెక్యూరిటీ ఆసియా దీనికి సంబంధించి ఓ రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం.. బంగ్లాదేశ్‌కు పాక్‌.. 16 నుంచి 24 జేఎఫ్‌ 17 థండర్ బ్లాక్‌ 3 యుద్ధ విమానాలను సరఫరా చేసేందుకు రెడీగా ఉండొచ్చు. అంచనా వేసిన ఒప్పందం ప్రకారం వీటి ధర 400 నుంచి 700 మిలియన్ల డాలర్ల మధ్య ఉండొచ్చు. వీటిని తీసుకుంటే బంగ్లాదేశ్‌ కూడా అతిపెద్ద యుద్ధ జెట్‌లు ఉన్న దేశంగా నిలవనుంది.  

Also Read: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ

దీనివల్ల ఈశాన్య ప్రాంతంలో కూడా భద్రతా పరిస్థితిని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నందువల్ల భారత్‌ కూడా బంగ్లాదేశ్‌-పాక్ ఒప్పందాన్ని పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్‌ చాలాకాలం నుంచే తమ వైమానిక దళాన్ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో F7, MIG29, Yak130 లాంటి విమానాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవి ఆధునిక యుద్ధ అవసరాలకు సరిపోదు. అందుకే పాక్‌ నుంచి ఆధునిక యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ JF థండర్‌ బ్లాక్‌ 3 యుద్ధ విమానాలను చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొకేషన్, పాక్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.  

Advertisment
తాజా కథనాలు