Pahalgam Attack: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పహల్గామ్ దాడిపై స్పందించారు. ఉగ్రవాద దాడిని ఖండించిన ఆయన..దానికి కారణమైన పాకిస్తాన్ మీద మాత్రం భారత్ అనవసరంగా నిందలు వేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

New Update
Imran Khan

Imran Khan

భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సుద్దులు చెప్పారు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతను అక్కడి నుంచే తన లాయర్ల ద్వారా పహల్గామ్ దాడి మీద ఎక్స్ లో పోస్ట్ చేశారు. దాడి ఖండించిన ఇమ్రాన్ ఖాన్...ఆ పని పాకిస్తానే చేసిందన్న విషయాన్ని మాత్రం ఒప్పుకోలేదు. భారత్ తమ దేశంపై అనవసరంగా నిందలు వేస్తోంది అంటూ విమర్శించారు. భారత్ ఏ పని చేసినా ఆలోచించి చేయాలని నీతి వాక్యాలు పలికారు. దాయాది దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే పాక్ తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. సొంత దేశమే అతనని జైల్లో వేస్తే ఏం చేయలేకపోయిన ఇమ్రాన్ ఖాన్ భారత్ విషయం వచ్చేసరికి మాత్రం నోటికొచ్చింది మాట్లాడారు. 

ఇదిలా ఉంటే పాక్ మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన సోదరుడు షెహబాజ్ షరీఫ్ కు మాత్రం బుద్ధులు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు అందుబాటులో ఉన్న దౌత్యమార్గాలను వాడుకోవాలని, యుద్ధానికి దూరంగా ఉండాలని ఆయన చెప్పినట్లు సమాచారం.    

మరోవైపు పహల్గామ్ దాడికి ధీటైన జవాబు ఇస్తామని భారత ప్రధాని మోడీ అన్నారు. నిన్న ప్రధాని మోదీ నివాసంలో  రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌,  త్రివిధ దళాల అధిపతులు నిన్న సమావేశం అయ్యారు. ఇందులో మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

today-latest-news-in-telugu | pakistan | imran-khan | attack in Pahalgam 

Also Read: Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..

Advertisment
తాజా కథనాలు