Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. రూ.35 వేల కోట్ల నష్టం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ విమానాలు భారత్‌ వైపు రాకుండా కేంద్ర ప్రభుత్వం గగనతలాన్ని మూసేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి రూ.35 వేల కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan Airports Authority Loss 4 Billion After Airspace Closure To India, Report

Pakistan Airports Authority Loss 4 Billion After Airspace Closure To India, Report

ఇటీవల జమ్మూకశ్మీర్‌(Jammu & Kashmir) లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Attack) సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం పాకిస్థాన్ విమానాలు భారత్‌ వైపు రాకుండా కేంద్ర ప్రభుత్వం గగనతలాన్ని మూసేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి భారీ నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో  దీనికి సంబంధించి నివేదికలు సమర్పించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. భారత్‌ గగనతలాన్ని ఏప్రిల్ 24 నుంచి జూన్‌ 20 వరకు మూసివేశారు. దీనివల్ల పాకిస్థాన్‌కు రూ.4.10 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.35 వేల కోట్లు) నష్టం జరిగినట్లుపేర్కొన్నాయి. 

Also Read: రష్యాతో చర్చల తర్వాత అదనపు సుంకాలుండవు..పాకిస్తాన్ ఆశాభావం

Pakistan Airports Authority

మొత్తంగా భారత్ గగనతల ఆంక్షల వల్ల రోజుకు 100 నుంచి 150 పాక్‌ విమానాలపై ప్రభావం పడింది. విమానాల రాకపోకలు 20 శాతం వరకు తగ్గిపోయాయి. దీనివల్ల పాక్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి వచ్చే ఆదాయం తగ్గిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాక్‌ మధ్య దౌత్యపరంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత భారత్‌.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, సరిహద్దును, గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు పాక్‌ విమానాలకు భారత్‌ గగనతలాన్ని ముసివేయడాన్ని కేంద్రం ఆగస్టు 24 వరకు పొడిగించింది. పాకిస్థాన్‌కు రూ.128 కోట్లు నష్టం రావడం అక్కడ చర్చనీయాంశమవుతోంది. ఇదిలాఉండగా ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ విషాద ఘటనలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్‌కు భారత్‌ చుక్కలు చూపించింది. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ పౌరులను వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.   

Also Read: ట్రంప్‌కు భారత్ బిగ్ షాక్.. బెదిరింపులకు భయపడదే లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్

ఆ తర్వాత పాక్‌ విమానాలను భారత్‌ గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. మనకన్న ముందు భారత్‌ విమానాలను పాకిస్థాన్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్‌ భారత్‌పై డ్రోన్లతో దాడులకు యత్నించింది. కానీ భారత రక్షణ వ్యవస్థ పాక్‌ దాడులను తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విమరణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పంద జరిగిన తర్వాత కూడా పలువురు పాక్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. వాళ్లను మన బలగాలు హతం చేశాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతోంది. 

Also Read: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం

Advertisment
తాజా కథనాలు