USA: ఎపిస్టీన్ ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికాతో పాటూ బ్రిటన్ నూ కుదిపేసిన సెక్స్ కుభకోణం ఎపిస్టీన్ ఫైల్స్  ను విడుదల చేసే బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంకతం చేశారు. డెమోక్రాట్ల నిజాలు బయపెట్టేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నాని తెలిపారు.

New Update
trump

కొన్ని రోజుల క్రితం తాను సైతం ఆరోపణలు ఎదుర్కొన్న సెక్స్ కుంభకోణం ఎపిస్టీన్ ఫైల్స్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫైల్స్ ను విడుదల చేసే బిల్లుపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన ట్రూత్ సోసల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో డెమోక్రాట్లపై పలు ఆరోపణలు చేశారు. నిందితుడు జెఫ్రీతో డెమొక్రాట్లకు ఉన్న సంబంధాలు గురించి నిజాలు బయటపడాలనే ఉద్దేశంతోనే తాను ఆ ఫైల్స్ విడుదల చేసే బిల్లుపై సంతకం చేశానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ల విజయాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే డెమోక్రాట్లు ఎపిస్టీన్ ఫైల్స్ ను బయటకు తీసుకువచ్చారని...తమ కంటే దానితో వారే ఎక్కువ ప్రభావితం అవుతారని ట్రంప్ అన్నారు. దానిని వారు తమపై ఆయుధంగా ప్రయోగించాలనుకున్నారు కానీ ఇప్పుడు అది డెమోక్రాట్ల నిజాలనే బయటపెడుతుందని చెప్పుకొచ్చారు. 

సెనేట్ లో ఏకగ్రీవ ఆమోదం..

‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ట్రాన్స్పరెన్సీ యాక్ట్‌’ అని ఈ బిల్లుకు పేరు పెట్టారు. ఈ ఫైళ్ల విడుదలను తాను వ్యక్తిగతంగా సాధించిన పారదర్శకత విజయంగా ట్రంప్‌ చెప్పుకున్నారు. ఈ ఫైళ్ళ విడుదలపై నిన్న అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగా.. 427-1ఓట్లతో దానికి ఆమోదం లభించింది. ఆ తర్వాత సెనేట్ లో కూడా ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీని తరువాతనే ట్రంప్ ఫైళ్ళ విడుదల చేసే బిల్లుపై సంతకం చేశారు. ఇప్పుడు న్యాయశాఖ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అన్ని ఫైళ్లతో పాటు 2019లో జైలులో అతడి మరణంపై దర్యాప్తు గురించిన సమాచారాన్ని 30 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే దీనిలో బాధితుల వివరాలు, దర్యాప్తు విరాలు మాత్రం బయటపడకుండా జాగ్రత్త పడనున్నారు. 

ఎపిస్టీన్.. పేద , మధ్య తరగతి బాలికలు, యువతులకు డబ్బులు ఆశ చూపించి ఇళ్ళకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడడమే ఈ కుంభకోణం లో ప్రధాన ఆరోపణ. చాలా ఏళ్ళు సాగిన తర్వాత దీని గురించి బయటపడింది. దాని తరువాత ఎపిస్టీన్ అరెస్ట్ కూడా అయ్యాడు. అయితే జైల్లో ఉండగా అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సెక్స్ కుంభకోణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీని కారణంగా ఆండ్రూ రావంశ బహిష్కారానికి కూడా గురైయ్యాడు. ఎపిస్టీన్ తో ట్రంప్ తనకు పరిచయం ఉందని..కానీ తాను ఎటువంటి తప్పు చేయలేదని ఇన్నాళ్లు చెప్పారు. దాంతో పాటూ ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను బహిర్గతం చేయడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్ళ కారణంగా ట్రంప్ ఈ ఫైల్స్ బిల్లుపై సంతకం చేయడమే కాక..దానికి మద్దుతు ఇవ్వాలని రిపబ్లికన్లను కోరారు. 

Also Read: Delhi Student: ఢిల్లీ మెట్రో నుంచి దూకిన బాలుడు..టీచరే కారణమని నోట్

Advertisment
తాజా కథనాలు