Honeytrap : ఎంతకు తెగించావ్ రా.. తల్లిని అడ్డు పెట్టుకుని హనీట్రాప్‌

ఇటీవలి రోజుల్లో హనీట్రాప్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి పట్టణంలోని ఓ బ్యాంకు మేనేజరును హనీట్రాప్‌లో ఇరికించేందుకు ఒక యువకుడు (24) తన తల్లిని అడ్డుపెట్టుకున్నాడు.

New Update
kannada

ఇటీవలి రోజుల్లో హనీట్రాప్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఇండి పట్టణంలోని ఓ బ్యాంకు మేనేజరును హనీట్రాప్‌లో ఇరికించేందుకు ఒక యువకుడు (24) తన తల్లిని అడ్డుపెట్టుకున్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన బ్యాంకు సమీపంలో కొబ్బరి బోండాలు అమ్మే 44 ఏళ్ల ఓ మహిళతో మేనేజరుకు పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే నవంబరు 1న తాను ఇంట్లో ఒంటరిగా ఉంటానని, ఇంటికి రావాలని అతన్ని పిలిచింది. దీంతో అతను సన్నిహితంగా ఉన్నప్పుడు కిటికీ వద్ద ఫోన్ పెట్టి అంతా రికార్డు చేసింది. అయితే అక్కడ ఆ ఫోన్ ఏంటని గుర్తించిన ఆ మేనేజరు గుర్తించి ఫోన్ అక్కడ ఎందుకు పెట్టావని ప్రశ్నించాడు.. అయితే అది పనిచేయడం లేదని ఆమె సమధానం ఇచ్చింది. 

బ్యాంకు మేనేజరుకు  ఫోన్‌ చేసి

ఇది జరిగిన నాలుగు రోజుల తరువాత.. అంటే నవంబరు 5వ తేదీన ఆమె ఆ బ్యాంకు మేనేజరుకు  ఫోన్‌ చేసి, మన ఏకాంతంగా కలిసిదంతా ఎవరో రికార్డు చేశారని, డబ్బు కోసం బెదిరిస్తున్నారని చెప్పడంతో అతను కంగుతిన్నాడు. దీంతో వారితో ఫోన్ లో  మాట్లాడి దీన్ని డీల్ చేయాలని ఆ వీడియోలు బయటకు రాకుండా చూడాలని కోరింది. 

ఆమె కొడుకు అమూల్, అల్లుడు మహేశ్‌ బగలి, ఓ న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్న తౌసిఫ్‌ ఖురేశిలు ఓ ముఠాగా ఏర్పడి, ఆ మేనేజరుకు ఫోన్‌చేశారు. ఏకంగా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  లేకపోతే టీవీ ఛానెళ్లకు ఈ వీడియోను ఇస్తామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోవిచారణ చేపట్టిన పోలీసులు ముందుగా అమూల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి ఆ మహిళతో పాటు మరో ఇద్దరు పరారయ్యారు. ఇదే తరహాలో ఆ మహిళను అడ్డుపెట్టుకుని పలువురి నుంచి వీరు డబ్బులు వసూలు చేసిందని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. 

Advertisment
తాజా కథనాలు