/rtv/media/media_files/2025/03/09/ZR8PkeNgMof36f1srj4M.jpg)
Over 1,000 dead in 2 days of clashes, revenge killings in Syria
సిరియాలో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హింస చెలరేగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారుల తిరుగుబాటు వల్ల స్థానికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అసద్ మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనగా చెబుతున్నారు.
Also Read: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
అయితే తాజాగా జరిగిన ఘర్షణలకు సంబంధించి బ్రిటన్‌కు చెందిన సిరయన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. అసద్ మద్దతుదారులు ముందుగా ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాత భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. రెండు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా వెయ్యి మందికిపైగా మృతి చెందారు. వీళ్లలో 745 మంది సాధారణ పౌరులే ఉన్నారు. మరో 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది అసద్ మద్దతుదారులు మృతి చెందారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరుగుబాటుదారులు ఇటీవల సిరియాను ఆక్రమించారు. దీనివల్ల అసద్ తన కుటుంబంతో రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత తిరుగుబాటుదారులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.దీన్ని వ్యతిరేకిస్తూ అసద్ సపోర్టర్స్ జబ్లే నగరంలో భద్రతా దళాలపై దాడులు జరిపి చంపేశారు. దీంతో అసద్ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలు ఇళ్లకు నిప్పంటించారు. బనియాస్ సిటీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల మృతదేహాలను వీధుల్లో, అలాగే ఇళ్లల్లో కూడా పడి ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు.
Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు!